అమర్కళం రీ రిలీజ్‌ | - | Sakshi
Sakshi News home page

అమర్కళం రీ రిలీజ్‌

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

తమిళసినిమా: నటుడు అజిత్‌ కుమార్‌ హీరోగా నటించిన కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం అమర్కళం. ఇప్పుడు ఆదర్శ దంపతులుగా జీవిస్తున్న అజిత్‌ కుమార్‌ శాలిని హీరో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ఇది. అదేవిధంగా అజిత్‌ కుమార్‌ హీరో నటించిన 25వ చిత్రంగా గుర్తింపు పొందింది. అప్పటివరకు ప్రేమ కథ చిత్రంలో నటించిన అజిత్‌ కుమార్‌ యాక్షన్‌ హీరోగా అవతారమెత్తిన చిత్రం కూడా ఇదే. చరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1999లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమ, సెంటిమెంట్‌ ,యాక్షన్‌ వంటి అంశాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే నటుడు అజిత్‌ కుమార్‌ ఆసక్తికరమైన నటన, నటి శాలిని మనసులను కదిలించే నటన ఈ చిత్రానికి హైలైట్‌ గా నిలిచాయి. కాగా సుమారు 26 ఏళ్ల తర్వాత అమర్కళం చిత్రం డిజిటల్‌ ఫార్మేట్‌లో రీ రిలీజ్‌ కావడానికి సిద్ధమైంది. స్వేరో సినిమాస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని కార్తీక్‌ వెంకటేశన్‌ ఆధునిక హంగులతో రూపొందించి రీ రిలీజ్‌ చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని అజిత్‌ కుమార్‌ , శాలినిల పెళ్లిరోజు అయిన ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రీరిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement