తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎల్‌ఐకే. నటి కృతీశెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్ వివన్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్‌ఎస్.లలిత్‌కుమార్, రౌడీ ఫిక్చర్స్ సంస్త అధినేత నటి నయనతార నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని, రవివర్మన్ ఛాయాగ్రణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకున్న ఎల్‌ఐకే చిత్రం ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు నానుమ్ రౌడీదాన్ చిత్రాన్ని తన ఎక్స్‌తో కలిసి చూశానన్నారు. అప్పుడే తాను దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు అభిమానిని అయ్యానన్నారు. అలాంటి దర్శకుడు తనతో చిత్రం చేస్తానని చెప్పగానే చాలా సర్‌పైజ్ అయ్యానన్నారు. తానుకు ఒక ఆశ ఉండేదన్నారు. దర్శకుడిగా ఓ ఫ్యూచరిస్టిక్ చిత్రాన్ని చేయాలని భావించానన్నారు. అందుకోసం కథలను ఆలోచించే పనిలో పడ్డానని చెప్పారు. అలాంటి సమయంలో ఇది ఫ్యూచర్ కథా చిత్రం అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయ్యానన్నారు. అలాంటి ప్చూచర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రాలు ఇండియాలో చాలా అరుదు అని పేర్కొన్నారు. దర్శకుడు ఆ ఐడియా చెప్పగానే సూపర్ అని అన్నానన్నారు. ఆయన కథను పూర్తిగా చెప్పగానూ ఈ చిత్రాన్ని కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యానన్నారు. ఆ తరువాత ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పగా వేరే లెవల్ సంతోషం కలిగిందన్నారు. నటుడు ఎస్‌జే.సూర్య గురించి ఒక్క విషయం చెప్పాలన్నారు. తాను కాలేజీ చదువు పూర్తి చేసిన తరువాత ఆయన వద్ద సహాయ దర్శకుడిగా చేరాలని ఆశపడ్డాననీ, అందుకు ఎస్‌జే.సూర్య కార్యాలయానికి వెళ్లి రెజ్యుమ్ కూడా ఇచ్చి వెళ్లమన్నారన్నారు. ఆ సంఘటన తనకు బాగా గుర్తుందన్నారు. తన గురించి చాలా విషయాలు అడిగి, ప్రపంచ సినిమాలు ఎక్కువగా చూడమని చెప్పారన్నారు. ఆయన అప్పడు అడిగిన ప్రశ్నలే తన జీవితాన్ని మార్చాయని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు.


