వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌కు కోసం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా వేలూరు జిలాల గుడియాత్తం సమీపంలోని పాక్కం గ్రామ సమీపంలో మారథాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ సుబ్బలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 200 మంది కలుసుకున్నారు. అనంతరం మారథాన్ పోటీలు గుడియాత్తం బస్టాండ్ వరకు సుమారు ఐదు కిలో మీటరు దూరం వరకు పోటీలు జరిగింది. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు వేర్వేరుగా కలెక్టర్ బహుమతులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వందశాతం పోలింగ్ కావాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం క్రీడాపాధికార సంస్థ, మహిళా సమాఖ్య సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించి అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం శిశు సంక్షేమ శాఖ అద్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలచే గుడియాత్తం సమీపంలోని పాక్కం గ్రామం వద్ద వందశాతం పోలింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు.


