విద్యే నిజమైన సంపద | - | Sakshi
Sakshi News home page

విద్యే నిజమైన సంపద

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

కొరుక్కుపేట: విద్యే నిజమైన సంపదని వీఐటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ విశ్వనాథన్‌ అన్నారు. వీఐటీ చైన్నెలో వర్సిటీ దినోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్‌ విశ్వనాథన్‌ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వీఐటీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.వి.సెల్వం పర్యవేక్షణలో సాగిన ఈ వేడుకలకు ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ వినోద్‌కుమార్‌ పాల్గొని మాట్లాడారు. ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, నైపుణ్యాల యుగంలో అనేక అవకాశాలు ఆవిర్భవిస్తున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో విజయం సాధించాలన్నారు. వివిధ విభాగాల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు ప్రదానం చేశారు. చైన్నెలోని వీఐటీ అసోసియేట్‌ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ త్యాగరాజన్‌, చైన్నె వీఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, అడిసినల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మనోహరన్‌ పూర్వ విద్యార్థి మేజర్‌ వైభవ్‌ చౌరాసియా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement