తిరువణ్ణామలైలో స్టాలిన్‌ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

తిరువణ్ణామలైలో స్టాలిన్‌ ప్రచారం

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

వేలూరు: డీఎంకే పార్టీ మేనిఫెస్టో ప్రజల మధ్య సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతోందని సీఎం స్టాలిన్‌ అన్నారు. తిరువణ్ణామలై అసెంబ్లీ డీఎంకే అభ్యర్థి ఏవా వేలుకు మద్దతుగా తిరువణ్ణామలై పట్టనంలో కాలి నడకన వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మార్కెట్‌ వద్దకు వెల్లి ప్రజల వద్ద కరపత్రాలు అందజేసి ఓట్లును అభ్యర్థించారు. అనంతరం మాడ వీధుల్లో సుమారు నాలుగు కిలో మీటరు దూరం నడిచి వెళ్లి ఓటర్లను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మైనారిటీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టలేదని.. అలాంటిది ప్రస్తుతం ఎన్నికల కోసం మైనారిటీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో బీజేపీ తీసుకొచ్చిన ప్రతి చట్టాలకు అన్నాడీఎంకే మద్దతు తెలిపి ప్రస్తుతం ఏమీ తెలియనట్లు కపట నాటకం ఆడుతున్నారన్నారు. బీజేపీ తీసుకొచ్చే పలు చట్టాలను డీఎంకే తరచూ పోరాటాలు చేసిందన్నారు. గతంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్పప్పడు ఎందుకు ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెపుతుందని తాము అధికారానికి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చుతామన్నారు. అన్నాడీఎంకే ఎన్ని బూటకపు కథలు చెప్పినా మైనారిటీలు డీఎంకేను వదిలి పెట్టరన్నారు. ఇక కాలి నడకన వెళ్తున్న సమయంలో అన్నామలైయార్‌ ఆలయం సమీపంలోని ఓ టీ దుకాణంలో కూర్చొని ప్రజలతో స్టాలిన్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement