క్రీడలతో చదువుకు నష్టం లేదు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో చదువుకు నష్టం లేదు

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

తిరువళ్లూరు: క్రీడల్లో విద్యార్థులు పాల్గొనడం ద్వారా చదువుకు నష్టం ఏర్పడుతుందన్న భావన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని ప్రముఖ వక్త, కవి రామలింగం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే కళాశాలలో 31వ క్రీడాదినోత్సవం, వార్షికోత్సవం ప్రిన్సిపల్‌ మహ్మద్‌జునైత్‌ అధ్యక్షతన నిర్వహించారు. కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ మునిరత్నం మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా మొదడు చురుగ్గా పనిచేస్తుందన్నారు. కవి రామలింగం మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక మార్పులతో పోటీపడే విధంగా తీర్చిదిద్దడంతోపాటు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ఆర్‌ఎంకే కళాశాల సావనీర్‌ను విడుదల చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యాక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డైరెక్టర్‌ జ్యోతినాయుడు, ఉపాధ్యక్షుడు కిషోర్‌, కార్యదర్శి యలమంచి ప్రదీప్‌, ఉపాధ్యక్షురాలు దుర్గాదేవి, ట్రస్టీలు సౌమ్య, మాజీ వీసీ డాక్టర్‌ పళనిస్వామి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అదికారి పిచ్చాండి, డీన్‌ డాక్టర్‌ మణివణ్ణన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement