భక్తిశ్రద్ధలతో ఈద్‌ ముబారక్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఈద్‌ ముబారక్‌

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

తిరువళ్లూరు: ముస్లింలు రంజాన్‌ వేడుకలను తిరువ ళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శనివారం రంజాన్‌ కావడంతో తిరువళ్లూరు, మనవాలన గర్‌, ఊత్తుకోట, తామరపాక్కం, ఆవడి, అంబత్తూరు, పూందమల్లి, పొన్నేరి, గుమ్మిడిపూండి ప్రాంతాల్లోని మసీదుల్లో పండుగ సందడి నెలకొంది. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం నిరుపేదలకు మాంసం, గోధుమ, బియ్యం ఉచితంగా అందజేశారు. పట్టణంలోని ఈద్గా మైధానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థఽనలకు వేలాది మంది హాజరయ్యారు. అనంతరం అన్నదానం, మజ్జిగ అందజేశారు.

వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో

వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు , తిరువణ్ణామలై జిల్లాలోనూ రంజాన్‌ వేడుకలను ముస్లింలు ఘ నంగా జరుపుకున్నారు. వేలూరు ఆర్‌ఎన్‌ పాళ్యంలోని ఈద్గా మైదానంలో అధిక సంఖ్యలో ఇస్లామియన్‌లు ప్రార్థనలు చేశారు. వేలూరు కస్పాలోని పెద్ద మసీదు, చిన్న మసీదు, అల్లాపురం, కొనవట్టం, విరుదంబట్టులో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆంబూరు, వానియంబాడి, మేల్‌ విషారం, కీల్‌ విషారం, వాలాజ ప్రాంతాల్లో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత బోధకులు రంజాన్‌ విశిష్టతను తెలియజేశారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తిరుత్తణిలో..

తిరుత్తణి: తిరుత్తణిలోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పళ్లిపట్టు, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, ఆర్కేపేట, కేజీ.కండ్రిగ ప్రాంతాల్లో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement