● వ్యూహాలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండండి ● డీఎంకే శ్రేణులకు సీఎం స్టాలిన్‌ పిలుపు | - | Sakshi
Sakshi News home page

● వ్యూహాలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండండి ● డీఎంకే శ్రేణులకు సీఎం స్టాలిన్‌ పిలుపు

Dec 9 2025 9:37 AM | Updated on Dec 9 2025 9:37 AM

● వ్య

● వ్యూహాలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండండి ● డీఎంక

● వ్యూహాలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండండి ● డీఎంకే శ్రేణులకు సీఎం స్టాలిన్‌ పిలుపు

సాక్షి, చైన్నె : నా పోలింగ్‌ కేంద్రం.. విజయపు కేంద్రం అనే నినాదంతో డీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం సోమవారం నిర్వహించారు. అన్నా అరివాలయం నుంచి సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. అన్ని జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు ఆయా జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ తమ ప్రాంతాలలో పరిస్థితులను ఈ సమావేశం ద్వారా స్టాలిన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై చర్చించారు. మాదిరి ఓటరు జాబితా విడుదల కాగానే సమగ్రంగా పరిశీలించాలని, ఎవరి ఓట్‌లైనా గల్లంతై ఉంటే తక్షణం ఆ ఓట్లను జాబితాలో చేర్పించేందుకు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించారు.

ఓటింగ్‌ శాతం పెరగాలి..

2021 ఎన్నికలలో 2 కోట్ల 9 లక్షల ఓట్లను డీఎంకే కూటమి సాధించిందని గుర్తు చేస్తూ, ఈ సారి సంఖ్య మరింతగా పెరగాలని ఆదేశించారు. ఒక కోటి 86 లక్షల మంది ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నారని గుర్తుచేస్తూ, లబ్ధిదారులు, పార్టీ వర్గాలు, తటష్ట ఓటర్లను కలుపుకుంటూ సంఖ్య 2.50 కోట్లు ఈసారి మించి పోవాలని ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పనులు సాగాలని సూచించారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, ఇదే తాను ఇస్తున్న ధైర్యం అని, ఈ ధైర్యంతో మరింత ఉత్సాహంగా పనులలో దూసుకెళ్లాలని పేర్కొన్నారు. శత్రువు సీబీఐ, ఐటీ, ఈడీ చివరకు ఎన్నికల కమిషన్‌ను సైతం తన గుప్పెట్లో పెట్టుకుని ప్రయోగాలు, వ్యూహాలు, కుట్రలు పన్నుతారని, అవసరం అయితే నకిలీ వీడియోలతో మరిన్ని వ్యూహాలు రచిస్తారని పేర్కొన్నారు. ఈ సమయంలో బలాన్ని సరిగ్గా ప్రయోగించేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో నిర్వాహకులు, వార్డు నుంచి జిల్లా కార్యదర్శుల వరకు అందరూ తమ పనితీరును మెరుగు పరచుకోవాలని వివరించారు. తాను సైతం నిత్యం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. రానున్న రోజులలో ప్రతి ఒక్కరి నుంచి తాను ఆశిస్తున్నది మరింత శ్రమ, కృషి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి పోలింగ్‌ కేంద్రాల పరిధిలో గెలుస్తారన్న నమ్మకంతో బాధ్యతలను అప్పగిస్తున్నానని, తన నమ్మకాన్ని కాపాడాలని, మళ్లీ గెలుద్దాం...చరిత్ర సృష్టిద్దాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌, కోశాధికారి టీఆర్‌ బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్‌ నెహ్రు, యువజన ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

23 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు

సాక్షి, చైన్నె: తమిళనాడులోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలలో 23 మినీ స్టేడియంల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ పనులకు సీఎం స్టాలిన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. తమిళనాడులో క్రీడలకు పెద్ద పీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వివిధ పోటీలకు తమిళ నాడు వేదికగా మారుతున్నది. ఈ పరిస్థితులలో క్రీడాకారుల కోసం మినీ స్టేడియంల నిర్మాణం, ఇతర సౌకార్యల కల్పనను విస్తృతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా స్టేడియంల నిర్మాణాలను విస్తృతంచేశారు. ఒక్కో నియోజకవర్గంలో రూ. 3 కోట్లతో స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. తొలుల 8 నియోజకవర్గాలలో స్టేడియంల నిర్మాణం పూర్తి చేశారు. రెండో విడతగా 22, మూడో విడతగా 44 అసెంబ్లీ నియోజకవర్గాలలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 69 కోట్లతో ఈ స్టేడియంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌, మంత్రి అన్బిల్‌ మహేశ్‌, టీఆర్‌బీ రాజా, ప్రధాన కార్యదర్శి మురుగానందం, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా,తమిళనాడు క్రీడా అభివృద్ది సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చేపల దిగుమతి కేంద్రాలు

అనంతరం జరిగిన కార్యక్రమంలో రూ. 98.92 కోట్లతో ఫిష్షింగ్‌ హార్బర్లు, చేపల దిగుమతి కేంద్రాలు, చేపల పెంపక కేంద్రాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మంత్రి అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం స్టాలిన్‌ను నీటి పారుదల శాఖ అధికారులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తాము అందుకున్న జాతీయ జల పురస్కారాలు , జల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం (జన్‌ సంచయ్‌ జన్‌ భగీదారి అవార్డులు) అవార్డులను సీఎం స్టాలిన్‌కు అందజేశారు.

ఆపన్న హస్తం

కళ్లకురిచ్చిలో తల్లిదండ్రులను కోల్పోయన నలుగురు పిల్లల భవిష్యత్తను దృష్టిలో ఉంచుకుని సీఎం స్టాలిన్‌ ఆపన్న హస్తం అందించారు. కలైంజ్ఞర్‌ కలల గృహాన్ని సీఎం స్టాలిన్‌ కేటాయించారు.కళ్లకురిచ్చి జిల్లా శంకరపురం తాలూకా భూతాయి గ్రామం కమలకన్నన్‌ అనారోగ్య కారణాలతో మరణించాడు. అనారోగ్యంతో అప్పటికే ఆయన భార్య వసంతి కూడా మృతి చెంది ఉన్నారు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు అనాదగా మిగలాల్సివ చ్చింది. కమలకన్నన్‌ కుమార్తె లావణ్య అభ్యర్థనతో స్టాలిన్‌ స్పందించారు. తల్లిదండ్రుల మరణంతో అనాథలుగాఉన్న వారి కుమార్తెలు లావణ్య, రిషిక, రీనా, కుమారుడు అప్నే ష్‌లను చైన్నెకు స్టాలిన్‌ పిలిపించారు. కలైంజ్ఞర్‌ కలల గృహం కేటాయించారు. శంకరాపురం ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయంలో కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పో స్టును అప్పగించారు. రిషిక, సెల్వన్‌కు అన్బుకరంగల్‌ పథకం ద్వారా నెలకు రూ. 2 వేలు భత్యం,రీనాకు రూ.6 వేలు స్కాలర్‌ షిప్‌లను అందజేశారు.

● వ్యూహాలను తిప్పి కొట్టేందుకు  సిద్ధంగా ఉండండి ● డీఎంక1
1/1

● వ్యూహాలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండండి ● డీఎంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement