స్పృహ తప్పిన లొకోపైలెట్
● తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో ఆగిన బిలాల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ● ప్రయాణికులు సురక్షితం
తిరుత్తణి: వేగంగా ప్రయాణిస్తున్న రైలులో ఇంజిన్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా స్పృహ తప్పారు. ఈ క్రమంలో రైలు వేగం తగ్గించి స్టేషన్‌లో నిలపడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. తిరునల్వేలి నుంచి చత్తీ్‌స్‌గడ్ రాష్ట్రంలోని బిలాల్‌పూర్ వెళ్లే (22620) ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి 9 గంటలకు అరక్కోణం జంక్షన్ ద్వారా తిరుత్తణి బయలుదేరింది. ఆ రైలులో ఆంధ్రాకు చెందిన 500కు పైగా అయ్యప్ప భక్తులు ప్రయాణం చేశారు. అయితే ఇంజిన్ డ్రైవర్ ఆంధ్రాకు చెందిన వెంకటశివప్రసాద్ అకస్మాత్తుగా స్పృహతప్పడంతో రైలు వేగం తగ్గించి మరో లొకోపైలెట్ తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపారు. దీంతో ఇంజిన్ డ్రైవర్‌ను అక్కడున్న రైల్వే సిబ్బంది వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చిక్సిత కోసం చేర్చారు. ఈ క్రమంలో అయితే తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో రాత్రి 11 గంటల వరకు రైలు ఆగిపోవడంతో అరక్కోణం రైల్వే అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేపట్టి మరో ఇంజిన్ డ్రైవర్‌ను పంపించి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి వెళ్లింది.
విల్లుపురం–చైన్నె
హైవేపై ప్రమాదం
– ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
అన్నానగర్: చైన్నె సమీపంలోని రెడ్ హిల్స్ కరనోడై ప్రాంతానికి చెందిన ఏళుమలై కుమారుడు గోవిందరాజ్ (55). ఇతను కుటుంబంతో కలిసి చైన్నె నుంచి కారులో విల్లుపురం సమీపంలోని వలవనూర్‌లోని కులదైవం ఆలయానికి వెళ్లారు. అక్కడి దేవుడికి దర్శనం చేసుకున్న తర్వాత, ఆదివారం సాయంత్రం అదే కారులో చైన్నెకి బయలుదేరారు. గోవిందరాజ్ కుమారుడు వెంకట్‌కుమార్ (35) కారు నడుపుతున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో తిండివనం సమీపంలోని తెన్పసియార్ వద్దకు చేరుకుంటుండంగా, ముందు వెళ్తున్న తెన్‌కల్వాయి గ్రామానికి చెందిన సెల్వం మోటార్ సైకిల్ ను కారు ఊహించని విధంగా ఢీకొట్టింది. దీంతో కారు నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు శిథిలాలలో చిక్కుకున్న గోవింద రాజ్, ఇతని భార్య తిరుపావై (48), వెంకట్‌కుమార్ భార్య కల్పన వల్లి (30) ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట్‌కుమార్, ఆయ న కుమార్తెలు మృదులాశ్రీ, అనన్యాశ్రీ, గోవిందరాజ్ కుమార్తె బృంద, అల్లుడు శరవణన్, మోటార్‌సైకిల్ నడుపుతున్న సెల్వం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మయిలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని రక్షించి, చికిత్స కోసం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం పై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా విల్లుపురం–చైన్నె జాతీయ రహదారిపై గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
అంతరాన్ని సృష్టించే
ప్రయత్నాలు ఫలించవు
– మంత్రి శేఖర్ బాబు
కొరుక్కుపేట:ఆధ్యాత్మికతకు, రాజకీయానికి మధ్య అంతరాన్ని సృష్టించాలనుకునే అల్ప మనస్తత్వం కలిగిన వారి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని మంత్రి శేఖర్ బాబు అన్నారు. పళనిలో కార్యక్రమంలో హిందూ మత ధార్మిక శాఖ మంత్రి శేఖర్ బాబు విలేకరులతో మాట్లాడారు. రూ. 4 కోట్ల విలువతో పళని కొండ ఆలయం ఉత్సవర్ మందిరం తోపాటూ ఆలయ గోపురాలకు వెండి పూత వేయడం, లైటింగ్ పనులు ప్రారంభించామన్నారు. పళని ఆలయ సముదాయం పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 6,500 మంది విద్యార్థులకు పుస్తకాల సంచులతో సహా విద్యా పరికరాలు అందించాం అని , ముత్తమిళ్ మురుగన్ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం, కళా, సాహిత్య పోటీలలో విజేతలుగా నిలిచిన 60 మందికి బహుమతి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని చారిత్రాత్మక కార్యక్రమంగా తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు దక్కుతుంది. ఉదయం అల్పాహార పథకాన్ని కూడా అమలు చేశాం, బోర్డింగ్ స్కూల్ విద్యార్థులకు సాయంత్రం భోజన పథకం కూడా ప్రారంభించామన్నారు. ధార్మిక శాఖ వివిధ పథకాలను అమలు చేస్తూనే ఉండడం వల్ల, చిన్నచిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మిక, మతపరమైన ఈ ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని సృష్టించడానికి యత్నిస్తున్నారు. అది జరగదు. ద్రావిడ నమూనా ప్రభుత్వాన్ని దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో శాంతి స్వర్గధామంగా ఉన్న తమిళనాడు లో అందరికీ ప్రతిదీ అనే మంత్రంతో పనిచేస్తున్నా మన్నారు, అన్ని మతాలను ఒకటిగా పరిగణిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమకు కావలసిన మార్గా న్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చని ఆయన అన్నారు.


