క్లుప్తంగా
భర్త ఆత్మహత్య
సేలం: పనికి వెళ్లలేదని భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పులియంపట్టి సమీపంలోని రామనాథపురానికి చెందిన ఆంథోని(44). ఇతను మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం తాగి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో భార్య జయరాణి భర్తను మందలించింది. దీంతో ఆంథోని భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపం చెందిన ఆంథోని ఇంట్లో ఉన్న విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన భార్య వెంటనే ఆంథోనీని సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. జయరాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులియంపట్టి పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిరాహార దీక్షకు అనుమతి
కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్‌లో పారిశుధ్య విధుల కేటాయింపులకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు కార్మికుల ఉద్యమ సంఘం సభ్యులకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చైన్నె కార్పొరేషన్‌లో పారిశుధ్య విధుల కేటాయింపును నిరసిస్తూ చైన్నెలోని రాజరత్నం గ్రౌండ్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలన్న కార్మికుల హక్కుల ఉద్యమ దరఖాస్తును చైన్నె పోలీసులు తిరస్కరించడాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యమ రాష్ట్ర కోశాధికారి ఆర్. మోహన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి ఎ.డి. జగదీష్‌చంద్ర ముందుకు వచ్చింది.కార్మికుల హక్కుల తరఫున హాజరైన న్యాయవాది కె. భారతి వాదిస్తూ, అంబత్తూరులోని తమ కార్యాలయంలో కేవలం నలుగురు సభ్యులు మాత్రమే నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారని, నిరసన తెలిపేందుకు సమావేశమయ్యే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమిక లక్షణమని వాదించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఉద్యమానికి షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
దివ్యాంగురాలిని గర్భవతిని చేసిన కేసులో..
అన్నానగర్: కడలూరు సమీపంలో దివ్యాంగ యువతిని గర్భవతిని చేసిన యువకుడికి కడలూరు మహిళా కోర్టు రూ.20,000 జరిమానా, 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించి, ప్రభుత్వ న్యాయవాది వలర్మతి జయచంద్రన్ కోర్టు ప్రాంగణంలో విలేకరులతో ఇలా అన్నారు. కడలూరు జిల్లా, వృద్ధాచలం తాలూకాకు చెందిన దివ్యాంగురాలు (21) గత 5 సంవత్సరాలుగా, ఆమె కురవన్ కుప్పం గ్రామంలోని మానసిక వికలాంగుల పాఠశాలకు వెళ్లివచ్చేది. ఈ స్థితిలో మార్చి 5, 2022న, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో, ఆమె ఇంటి వెనుక నివసించే నిందితుడు మణికంఠన్ (40) ఆమెకు మామమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి గర్భవతి కావడంతో నగరి మహిళా నైవేలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేసిన కడలూరు మహిళా కోర్టు కూడా నిందితుడు మణికంఠన్‌కు 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.20వేల జరిమానా విధించింది.
చైన్నెలో కుక్ గ్రామం!
సాక్షి,చైన్నె : చైన్నె అన్నానగర్‌లో గ్రామీణ వాతావరణంతో పూర్తి స్థాయిలో సేంద్రియ ఉత్పత్తులు, పదార్థాలతో ఊడిన కుక్‌గ్రామం ఫుడ్ కోర్టు ఏర్పాటైంది. ఆర్గానిక్ వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ పేరిట ఏర్పాటైన కుక్ గ్రామాన్ని ఆరోగ్య హెల్త్‌కేర్ సిద్ధ వైద్యుడు డాక్టర్ జి. శివరామన్ ప్రారంభించారు. ఆర్గానికి ఉత్పత్తలతో కొలువుదీరిన ఈ కుక్‌గ్రామం తమిళుల సంప్రదాయానికి ప్రతీక అని వ్యవస్థాపకురాలు దేవి తెలిపారు. అన్ని రకాల ఆర్గానిక్ ఫుడ్స్ ఇక్కడ లభిస్తాయని వివరించారు.
రెండు
ద్విచక్రవాహనాల ఢీ
ఇద్దరు దుర్మరణం
తిరువొత్తియూరు: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈఘటన చైన్నె, తూర్పు తీరం రోడ్డులో చోటుచేసుకుంది. చైన్నె వండలూరుకు చెందిన సూర్య(27). ఇతను చెయ్యూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్. శుక్రవారం సాయంత్రం తూర్పుకోస్తా రహదారి మీదుగా తన స్వగ్రామానికి బైక్‌లో బయలుదేరాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు మరక్కాణం సమీపంలోని కూనిమేడు మారియమ్మన్ కోయిల్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ (26), అరవింద్ (32) ఇద్దరూ బైక్‌లో పుదుచ్చేరి నుంచి కూనిమేడుకు వెళ్తున్నారు.మరక్కాణం సమీపంలోని రంగనాథపురం వద్ద కృష్ణన్ బైక్, సూర్య మోటార్‌సైకిల్ అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బైకుల్లో వెళుతున్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి సూర్య, కృష్ణన్ ఇద్దరూ మృతిచెందారు. అరవింద్ జిప్మర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


