●సంతకాల సేకరణ
కోటి సంతకాల సేకరణలో భాగంగా చైన్నె షోళింగనల్లూరు పరిసరాల్లో నివాసం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిగిరి ప్రాంతానికి చెందిన తెలుగు వారు తాము సైతం అంటూ ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని వ్యతిరేకిస్తూ ఇంటింట సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆప్రాంతానికి చెందిన వైఎస్సార్‌సీపీ, సేవాదళ్ వర్గాలు మల్యాద్రి, ఎస్పీ రెడ్డి, చంద్రశేఖర్, మహేంద్ర, గౌరయ్య, కల్యాణ, కొండయ్య, ఇజ్రాయేల్, శాంసంగ్, జోషప్ సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. – సాక్షి, చైన్నె


