ప్రియురాలితో జల్సాల కోసం..
తిరువళ్లూరు: బంగారు నగలు, సెల్‌ఫోన్ కోసం మహిళను హత్య చేసి పరారైన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా సూలైమేణి గ్మానికి చెందిన సరస్వతి(55). ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కొరట్టూరులో వుంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. దీంతో సరస్వతి ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళ శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్ష నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, పోలీసుల విచారణలో హత్యకు గురైన మహిళను అదే గ్రామానికి చెందిన వెంకటేషన్ హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా ప్రియురాలీతో జల్సాల కోసం డబ్బులు లేకపోవడంతోనే మహిళను హత్య చేసినట్టు నిందితుడు పేర్కొనడం గమనార్హం.
ప్రియురాలితో జల్సాల కోసం..


