బంగారు తిరుచ్చిపై కల్యాణ వెంకన్న
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై భక్తులను కటాక్షించారు. వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవను జరిపారు. అనంతరం స్వామివారు బంగారు తిరుచ్చిపై మాడవీధుల్లో ఊరేగారు. ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, ఆలయ ఇన్‌స్పెక్టర్ మునికుమార్ పాల్గొన్నారు.


