18న ఉద్యోగుల సమ్మెను విజయవంతం చేయాలి
తిరువళ్లూరు: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 18న తలపెట్టన ఉద్యోగుల సమ్మెను విజయవంతం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాద్యాయుల ఐక్యవేదిక జాక్టోజియో రాష్ట్ర కో– ఆర్డినేటర్ దాస్ పిలుపు నిచ్చారు. వివరాలు.. తిరువళ్లూరులోని ప్రవేటు మండపంలో జరిగిన ఉద్యోగులు ఉపాధ్యాయుల సమావేశఽంలో దాస్ ప్రసంగిస్తూ డీఎంకే ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకుపాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. టెట్ పరీక్ష రద్దు, ప్రభుత్వ జీవో 243ను రద్దు చేయడం, పార్ట్ టైమ్ ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోడంతో సమ్మెకు దిగుతున్నట్టు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో కో– ఆర్డినేటర్‌లు జ్ఞానశేఖరన్ పాల్గొన్నారు.


