28న తెరపైకి ఒండిమునియుమ్ నల్లపాడనుమ్
ఒండిమునియుమ్ నల్లపాడనుమ్ చిత్రంలో పరోటా మురుగేశన్
తమిళసినిమా: తమిళనాడులో కొంగునాడు ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. అయితే అదే నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరు చెప్పనటువంటి కథతో రూపొందిన తాజా చిత్రం ఒండిమునియుమ్ నల్లపాడనుమ్. తిరుమలై ప్రొడక్షన్స్ పతాకంపై కె.కరుప్పుస్వామి నిర్మించిన ఈ చిత్రానికి సుగమనం దర్శకత్వం వహించారు. ఇందులో నల్లపాడన్ పాత్రలో పరోటా మురుగేశన్ నటించగా, కార్తికేసన్, మురుగన్, విజయన్, సేనాపతి, చిత్ర, కౌశిక, తమిళినియన్ ముఖ్య పాత్రలు పోషించారు. జేడీ విమల్ చాయాగ్రహణం, మూడర్ కూడమ్ నటరాజన్ శంకరన్ సంగీతాన్ని అందించారు. ఈచిత్రం ఈనెల 28న తెరపైకి రానుంది. ఈసందర్భంగా మీడియాకు విడుదల చేస్తున్న ప్రకటనలో చిత్ర దర్శకుడు పేర్కొంటూ పొలాల్లో బాగా శ్రమించి పనిచేసే వ్యక్తిని కొంగు ప్రాంతంలో నల్లపాడన్ ఉంటారన్నారు. అలా ఆ ప్రాంతంలో శ్రమించే ప్రజల ఇతివృత్తమే ఈ చిత్ర కథ అని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రజలకు ఒండిముని కులదైవం అని చెప్పారు. అలాంటి ప్రజల కష్టనష్టాలు ,శ్రమ, పోరాటాలే ఈ చిత్రం కథ అని చెప్పారు. ఇది ప్రజల చిత్రమని, కచ్చితంగా ప్రేక్షకులకు చేరుతుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.


