బీజేపీ చెప్పింది.. నేను చేశాను!
– సెంగొట్టయ్యన్
సాక్షి, చైన్నె : బీజేపీ చెప్పడంతోనే తాను సమన్వయ నినాదాన్ని అందుకున్నట్టు అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయ్యన్ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. అయితే చివరకు తాను చీవాట్లు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారు, బహిష్కరించిన వారందరిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని, సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొంటే విజయం తథ్యం అని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యేల సెంగొట్టయ్యన్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్టీలో పదవిని కోల్పోయారు. చివరకు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ నినాదాన్ని అందుకునేందుకు ముందుగా ఆయన పలుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతో సమావేశమయ్యారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ చెప్పింది తాను చేశానంటూ సమష్టి నినాదం ప్రస్తావన గురించి వ్యాఖ్యలు చేశారు. అందర్నీ సమన్వయ పరిచేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ సూచించడంతోనే తాను రంగంలోకి దిగానని, అయితే, తాను తాజాగా అందరికి చెడ్డవాడ్ని అయ్యానని, చీవాట్లు ఎదుర్కొంటున్నానని అన్నారు. దొడ్డిదారిన సీఎం అయిన వ్యక్తి పళణిస్వామి అని, దివంగత అమ్మ జయలలిత ద్వారా మూడు సార్లు సీఎం కుర్చిలో కూర్చున్న నేత పన్నీరు సెల్వం అని గుర్తు చేశారు. సీనియర్లకు కనీస మర్యాద అన్నది కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పళణిస్వామికి మున్ముందు తీవ్ర నష్టాలు, కష్టాలు తప్పవని హెచ్చరించారు.
ఘనంగా కమల్
బర్త్‌డే వేడుకలు
సాక్షి, చైన్నె : మక్కల్‌నీది మయ్యం కట్చి(ఎంఎన్‌ఎంకే) కార్యాలయాలలో శుక్రవారం పార్టీ అధ్యక్షుడు, నటుడు, ఎంపీ కమలహాసన్ 70వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చైన్నె ఆళ్వార్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు మౌర్య పార్టీ జెండాను ఎగురవేశారు. తమ నేతకు శుభకాంక్షలు తెలుపుతూ నినాదాలు హోరెత్తించారు. స్వీట్లను అందరికి పంచిపెట్టారు. ఇదేవిధంగా అన్ని జిల్లాల్లోని కార్యాలయాల్లో కార్యక్రమాలు జరిగాయి. కమల్‌కు సీఎం స్టాలిన్‌తో పాటు పలు పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
అన్నా పురస్కారానికి
దరఖాస్తుల ఆహ్వానం
● తుది గడువు డిసెంబర్ 15
కొరుక్కుపేట: తమిళనాడు ప్రభుత్వం అందజేసే అన్నా పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 15వ తేదీ వరకు దర ఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి సంవత్స రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముగ్గురు పౌరులకు, ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు అన్నా పురస్కారాన్ని బహుకరిస్తారని పేర్కొంది. దరఖాస్తుదారులు తమిళనాడు నివాసితులై ఉండాలని, వయోపరిమితి లేదని తెలిపింది. దరఖాస్తులు, సిఫార్సులు htt pr://awardr.tn.gov.inలో మాత్రమే స్వీకరిస్తారని పేర్కొంది. దరఖాస్తుదారులు తాము చేసిన పనుల గురించి స్పష్టంగా, సంక్షిప్తంగా (గరిష్టంగా 800 పదాలు)రాయాలని తెలిపింది.
డీఎంకేపాలనలో
మహిళలకు భద్రత లేదు
– నైనార్ నాగేంద్ర
కొరుక్కుపేట: డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్ర తన వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కోయంబత్తూరులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేసిన మూడు రోజుల తర్వాత, కోయంబత్తూరులో ఒక మహిళను అపహరించిన దృశ్యాలు సీసీటీవీలో విడుదలయ్యాయి. తమిళనాడు పోలీసులు డీఎంకే కీలుబొమ్మలా వ్యవహరించకుండా, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని అపహరణకు గురైన మహిళను రక్షించడం దిగ్భ్రాంతికరం. కోయంబత్తూరులో విమానాశ్రయం సమీపంలో లైంగిక దాడి, రద్దీగా ఉండే రోడ్డుపై కిడ్నాప్ వంటి సంఘటనలు జరుగుతున్నాయని మనం చూసినప్పుడు, డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేదని స్పష్టంగా తెలుస్తుంది. అసమర్థ పరిపాలన, దిగజారిన శాంతిభద్రతలతో, మహిళలను కాపాడటానికి మీరు ఎంత మంది నేరస్థులను కాల్చి అరెస్టు చేస్తారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశ్నించారు. దేశం గౌరవించే మంచి ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం కాదని ఎద్దేవాచేశారు.
బీజేపీ చెప్పింది.. నేను చేశాను!


