మిన్నంటిన వందేమాతరం
ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయులను ఏక తాటిపైకి తెచ్చిన వందేమాతరం గేయం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటింది. భారతీయులలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రగిల్చిన ఈ వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో కార్యక్రమాలు జరిగాయి. జాతీయ జెండాలను చేతపట్టి ర్యాలీతో ముందుకు సాగారు. చైన్నెలోని మైలాపూర్‌లో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు మహిళా నేతలు, పార్టీ ముఖ్య నేతలు వందే మాతరం గీతాలాపనకు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో విల్లుపురం జిల్లాలోని చారిత్రాత్మక సెంజి కోటలో వందేమాతరం ఆలాపన జరిగింది. జాతీయ జెండాను చేతపట్టి గేయాన్ని ఆలపించారు.
మిన్నంటిన వందేమాతరం


