
ఎప్పటికీ చెరగని పేరు నాగేష్
ఉరుట్టు ఉరుట్టు ఆడియోను ఆవిష్కరించిన
ఆర్వీ ఉదయకుమార్, విక్రమన్, కస్తూరిరాజా, యూనిట్ సభ్యులు
తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మరువని శాశ్వత పేరు నగేష్. నా కుమారుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రంలో నాగేష్ నటించారు. ఆయన గురించి మాట్లాడకుండా ఏ సినిమా మీడియా ఉండలేదు. అన్ని విజయాలు సాధించిన నటుడు నాగేష్. అలాంటి తండ్రి బాధకు ఉపశమనం కలిగించేది గజేష్ నాగేష్. నువ్వు కథానాయకుడిగా నటించిన ఉరుట్టు ఉరుట్టు చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. చిత్తం నిర్మాతకు నా అభినందనలు అని సీనియర్ దర్శకుడు ధనుష్, దర్శకుడు సెల్వరాఘవన్ తండ్రి అయిన కస్తూరిరాజా ఉరుట్టు ఉరుట్టు చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకలో అన్నారు. జై స్టూడియో క్రియేషన్‌న్స్ పతాకంపై సాయి కావ్య, సాయి కై లాష్ సమర్పణలో పద్మరాజు జయశంకర్ నిర్మించిన చిత్రం ఉరుట్టు ఉరుట్టు. భాస్కర్ సదాశివం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గజేష్ నాగేష్ కథానాయకుడిగా నటించారు. నటి రిత్విక శ్రేయ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి యువరాజ్ బాలరాజ్ చాయాగ్రహణం, అరుణగిరి సంగీతాన్ని, కార్తీక్ కృష్ణన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. త్వరలో ఈచిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఆనందబాబు మాట్లాడుతూ తనను ఆదరించినట్లుగానే తన కుమారుడిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.