
జనాభా నియంత్రణకు సహకరించాలి
వేలూరు: జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని వేలూరులో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ జనాభా 743 కోట్లుగా ఉందని అన్నారు. సంవత్సరానికి జిల్లాలో 55 వేల మంది జన్మిస్తున్నారన్నారు. వీరిలో రెండవ చిన్నారులకు పైగా జన్మించే వారి సంఖ్య 12.8 శాతంగా ఉందన్నారు. వీటి శాతాన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన అవసరమన్నారు. విద్యా వేత్తలు, విద్యార్థులు మీ సమీపంలోని కుటుంబీకుల వద్ద ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. అనంతరం జనాభా నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ముందుగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, జోన్ చైర్మన్ వెంకటేశన్, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మణిమేగలై, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.