
ముగిసిన మొహర్రం వేడుకలు
● సీఎంతో సైఫుద్దీన్ భేటీ
సాక్షి, చైన్నె: చైన్నెలో పది రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక అషారా ముబారకా (మొహర్రం) వేడుకలు ముగిశాయి. దావూదీ బోహ్రాల సామాజిక వర్గం నాయకడు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్‌న్‌కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆతిథ్యం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 43,000 మందికి పైగా దావూదీ బోహ్రాలు తమ వార్షిక మొహర్రం సమాజం కోసం చైన్నెకు తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఆశారా ముబారకా సభ ముగింపుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దావూదీ బోహ్రా ముస్లిం సమాజం 53వ నాయకుడు ిసయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. తమిళనాడు హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. సయ్యద్నా నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగే వార్షిక మొహర్రం సమాజం ఆశారా ముబారకా గురించి, జూన్ 27 నుంచి జూలై 5, 2025 వరకు చైన్నెలో జరిగిన కార్యక్రమం గురించి ఈసందర్భంగా సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమం తమిళనాడులో కమ్యూనిటీలో అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటిగా నిలిచిందని, 50 సంవత్సరాల విరామం తర్వాత చైన్నెలో జరిగినట్టు తెలియజేశారు. వేలాది మంది హాజరైన వారికి అన్ని సౌకర్యాలు, భద్రత కల్పించిన ప్రభుత్వం, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్, చైన్నె పోలీసులు, ఇతర ప్రజా సేవా విభాగాలకు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ తన హృదయపూర్వక కృతజ్ఞతలను ఈసందర్భంగా తెలుపుకున్నారు. దావూదీ బోహ్రా సమాజం, క్రమశిక్షణ సంస్థ, పౌర దృక్పథం, వాణిజ్యం, వ్యాపారం, సామాజిక అభివృద్ధికి సహకారాన్ని ఈసందర్భంగా సీఎం స్టాలిన్ గుర్తుచేశారు.