
రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్
తిరువళ్లూరు: ఆవడిలో రూ.36.06 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బస్టాండుకు మంత్రులు శేఖర్‌బాబు, నాజర్ భూమిపూజ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో నూతన బస్టాండు నిర్మాణం కోసం 2024–25 బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. 1.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బస్టాండుకు భూమిపూజను గురువారం ఉదయం నిర్వహించారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ ఆవడిలో నిర్మించనున్న బస్టాండులో తాగునీరు, ఇంటర్‌నెట్ సదుపాయం, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, ప్రయాణికుల సీటింగ్ సదుపాయంతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రకాష్, అదనపు కార్యదర్శి శివజ్ఞానం, ఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుశంకర్, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు.