
క్రైస్తవ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తద్వారా సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ నేతలు గురువారం ఉదయం ఽతిరువళ్లూరులో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు ఐజాక్ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న క్రైస్తవులకు ప్రత్యేకంగా 10.5 శాతం రిజర్వేషన్ కల్పించాలి. పంచమీ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలైన క్రైస్తవులకు పంచిపెట్టాలి. రాష్ట్రంలో అనుమతులు కోసం ఎదురు చూస్తున్న క్రైస్తవ మిషనరీలు, కళాశాలలు, యూనీవర్శిటీలకు వెంటనే అనుమతులను ఇవ్వాలని నినాదాలు చేశారు. క్రైస్తవులు, చర్చి ప్రసంగీకులపైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్‌కుట్టి, జిల్లా అధ్యక్షుడు రాజన్, శ్యామ్యూల్ రాజ్‌సెడ్రిక్‌బెనోతో పాటూ పలువురు పాల్గొన్నారు.