
క్లుప్తంగా
14 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన మేనమామ
●పోక్సో చట్టం కింద అరెస్టు
అన్నానగర్: చైన్నెలోని తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అందులో శ్ఙ్రీనా 14 ఏళ్ల కుమార్తె గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. మేము ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆమె 2 నెలల గర్భవతి అని చెప్పారు. అది విని మేము దిగ్భ్రాంతి చెందాం. మేము నా కుమార్తెను దీని గురించి అడిగినప్పుడు, ఆమె గర్భధారణకు నా సోదరుడు కారణమని చెప్పడం విని మేము చాలా బాధపడ్డాం. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలిశ్రీశ్రీ అని పేర్కొంది. దీంతో తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేసి, బాలికను గర్భవతిని చేసినందుకు పోక్సో చట్టం కింద ఆమె మేనమామను గురువారం అరెస్టు చేసి జైలులో పెట్టారు.
నైల్లెయప్పర్ ఆలయ ఊరేగింపులో చోరీ
●భక్తుల నుంచి 15 సవర్ల నగలు, 18 సెల్‌ఫోన్లు అపహరణ
అన్నానగర్: నైల్లెయప్పర్ ఆలయ ఊరేగింపు సందర్భంగా దుండగులు భక్తుల నుంచి 15 సవర్ల నగలను దొంగిలించారు. అదేవిధంగా 18 మంది సెల్ ఫోన్లు చోరీ చేశారు. వివరాలు.. నైల్లె పట్టణం నైల్లెయప్పర్–కండిమతి అంబాల్ ఆలయంలో ఆనితిరువిళ రథోత్సవ ఊరేగింపు బుధవారం జరిగింది. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జనసమూహాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు పలువురి బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడు మత్స్యకారులపై రాళ్ల దాడి
●రూ.2లక్షల విలువైన చేపల వలలు కట్ చేసిన శ్రీలంక సముద్రపు దొంగలు
అన్నానగర్: నాగపట్నం జిల్లా వేదారణ్యం పక్కనే ఉన్న ఆరుకాట్టుతురై నివాసి చంద్రమోహన్ బుధవారం తిరునావుకరసన్ (35), రంజిత్ (30), చోళరాజ్ (30)తో కలిసి తన సొంత పైబర్ బోటులో చేపలు పట్టడానికి వెళ్లాడు. వారు అర్ధరాత్రి తమిళనాడు సరిహద్దు కొడియకరైకి ఆగ్నేయంగా చేపలు పడుతున్న సమయంలో, రెండు పడవల్లో ఆ ప్రాంతానికి వచ్చిన ఆరుగురు శ్రీలంక సముద్రపు దొంగలు రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. తర్వాత రూ.2 లక్షల విలువైన 300 కిలోల వలను కట్ చేసి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ఆరుకాట్టుతురైకి చెందిన పొన్నుదురై, కార్తీకు చెందిన పడవలపై కూడా మత్స్యకారులు రాళ్లు రువ్వి వారిని తరిమికొట్టారు. ఈమేరకు గురువారం ఒడ్డుకు తిరిగి వచ్చిన మత్స్యకారులు వేదారణ్యం తీరప్రాంత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్లస్–1 విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ప్లస్–1 విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుచ్చి జిల్లా ఇనియనూర్‌కు చెందిన పెరియసామి (48 ) టీ దుకాణం యజమానుడు. ఇతని భార్య దర్శన సత్య. వీరి కుమార్తె దర్శన (16) ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్లస్–1 చదువుతోంది. ఆమె నీట్ పరీక్ష కోసం కోచింగ్ క్లాస్‌కు వెళ్తోంది. ఇదిలా ఉండగా, కోచింగ్ సెంటర్‌లో నిర్వహించిన నీట్ పరీక్షలో మొదటి సెమిస్టర్ లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయని తెలుస్తుంది. దీంతో మనస్తాపం చెందిన దర్శన ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే చదువుకోవడానికి ఇంటి పై అంతస్తుకు వెళ్లిన దర్శన రాత్రి 7 గంటల తర్వాత కూడా తినడానికి రాకపోవడంతో ఆమె తల్లి సత్య పైకి వెళ్లి చూసింది. అప్పుడు ఆమె చీరతో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటం చూసి దిగ్భ్రాంతి చెంది ఏడ్చింది. ఆమె అరుపులు విన్న పొరుగువారు దర్శనను రక్షించి వెంటనే సోమరసంపేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు దర్శన మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటన పై సోమరసంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉపకార వేతనాల వితరణ
తిరువళ్లూరు: రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందవనం ఆధ్వర్యంలో మనవాలనగర్‌లోని విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందజేశారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో మథర్ థెరిస్సా బధిరుల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారు 100 మంది చెవిటిమూగ విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్దులకు సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు, లంచ్‌బాక్సులు తదితర వాటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ సంఘం అద్యక్షుడు నబీన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ఏజీ హరిశ్వరన్, సెక్రెటరీ ఢిల్లీబాబు, రీజినల్ సెక్రెటరీ మణిమారన్ తదితరులు హాజరై వస్తువులను పంపిణీ చేశారు. భవిషత్తులోనూ నిరుపేదలు, బధిర విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందజేస్తామని హమీ ఇచ్చారు.