
రూ.276 కోట్ల కస్టమ్స్ సుంకం చెల్లించాలి
● నాలుగు టోల్ ప్లాజాల గుండా ప్రభుత్వ బస్సులు నడపొద్దు ● హైకోర్టు ఆదేశాలు
కొరుక్కుపేట: దక్షిణ జిల్లా రహదారులపై ఉన్న 4 టోల్ బూత్‌ల వద్ద ఈనెల 10వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సులను అనుమతించకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మధురై, కన్యాకుమారి, తిరునేల్వేల్లి సహా దక్షిణ జిల్లాల్లోని ప్రదాన రహదారులపై నాలుగు టోల్ బూత్‌లనునిర్వహిస్తున్న కంపెనీలు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన కేసులలో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ చాలా కాలంగా తమ కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేదని, ఇంకా రూ.276 కోట్ల బకాయిలను ఖర్చు చేయలేదని ఆరోపించాయి. ఉద్యోగులు టోల్ బూత్‌ల వద్ద బస్సులను ఆపి చార్జీలు వసూల చేయలేని పరిస్థితి ఉందని, ఈ విషయంలో తగినచర్యలు తీసుకోవాలని కోరారు . ఈ కేసు విచారించిన న్యాయమూర్తి ఆనంద వెంకటేష్ మాట్లాడుతూ రవాణా సంస్థలు బకాయిలను పరిష్కరించకుండా వివాదాన్ని పొడిస్తూనే ఉంటే బకాయిలు రూ. 300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పైగా పెరుగుతాయన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా రవాణా సంస్థలు చర్యలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసును గురువారానికి వాయిదా వేశారు.