
కదం తొక్కిన కార్మిక లోకం
–200 మంది కార్మికుల అరెస్ట్
తిరువళ్లూరు: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల డిమాండ్‌లను పరిస్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. తిరువళ్లూరులోని రైతుబజార్ వద్ద నిర్వహించిన ఆందోళనకు డీఎంకే, ఐఎన్‌టీయూసీ, ఏ ఐటీయూసీ, సీఐటీయూ, ఏఐసీటీయూ, యూటీయూ సీ కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరైయ్యారు. కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బ్యాంకులు, రైల్వే, ఇన్సూరెన్స్, పోర్టులను ప్రైవేటీకర ణ చేయకూడదన్నారు. పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమల్లోకి తేవాలని, కార్మిక సంఘాల సంక్షేమ బో ర్డులను నిర్వీర్యం చేయకూడదని అన్నారు. కార్మిక వ్య తిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం కింద రూ.26 వేలు అందించాలని డి మాండ్ చేశారు. అనంతరం అనుమతి లేకుండా రాస్తారోకో చేశారన్న నెపంతో రెండు వందల మందిని అరె స్టు చేశారు. తమ డిమాండ్‌లను పరిస్కరించని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

కదం తొక్కిన కార్మిక లోకం