
ప్రతిభ చాటిన విద్యార్థినులు
కొరుక్కుపేట: విద్యార్థినిల్లోని ప్రతిభా పాటవాలను వెలికితీసేలా శ్రీ కన్యకాపరమేశ్వరీ మహిళా కళాశాలలో స్నిగ్ధా –2025 పేరిట సాంస్కృతిక ఉత్సవాలను రెండు రోజులు పాటు ఏర్పాటు చేశారు . తొలి రోజు బుధవారం ఉదయం కళాశాలలోని కళాలయా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున ఆఫ్ స్టేజ్ ఈవెంట్‌గా హెయిర్ డూ, నెయిల్ ఆర్ట్ ,బాటిల్ ఆర్ట్ ,మండల ఆర్ట్ పోటీలు నిర్వహించారు . ఈ సందర్భంగా మొదటి సంవత్సవంలో చేరిన విద్యార్థినిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆయా పోటీల్లో ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా జి స్వప్న, ఎస్ హరిణి , మరియాకెన్సీ వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చందన దీపా మాట్లాడుతూ ప్రతీ ఏడాది స్నిగ్థాపేరిట పోటీలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. విద్యార్థినుల్లో ప్రతిభను వెలికితీయటమే ఈపోటీల ప్రధాన లక్ష్యం అని అన్నారు . కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ ప్రోత్సాహంతో ఈపోటీలను చేపట్టినట్టు ఆమె వెల్లడించారు. విజేతలకు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ప్రతిభ చాటిన విద్యార్థినులు