
12న వేలూరులో క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
వేలూరు: రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న క్రికెట్ క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, నరువి ఆసుపత్రి చైర్మన్ జీవి సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు. బాగాయంలోని తందై పెరియార్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 25 సంవత్సరాలు లోపు ఉన్న క్రీడాకారులు వారి ఆధార్ కార్డు తో పాటు క్రికెట్ యూనిఫామ్ తో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.
నమ్మకానికి మద్దతుగా ఆవిష్కరణలు
సాక్షి, చైన్నె: రైతులు తమపై ఉంచిన నమ్మకానికి మరింత మద్దతుగా నిలిచే విధంగా ఆవిష్కరణలపై దృష్టి పెట్టామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఎఫ్‌వై 26లో కొత్త రికార్డు నమోదును వివరించారు. అత్యాధునిక ఇంజినీరింగ్ సామర్థ్యాలకు నిదర్శనంగా దమ్ ఆగే బద్నేకా అనే బ్రాండ్ వాగ్దానంతో 20–120 హెచ్‌పీ ట్రాక్టర్ విభాగంలో గణనీయమైన పురోగతిని ప్రతి రైతుకు అందించామన్నారు. రైతులకు ఖరీప్‌లో మరింత తోడ్పాటుగా, మెరుగైన ఆదాయం తీసుకొచ్చే విధంగా ఆవిష్కరణలలో సాంకేతితను ఉపయోగించనున్నామని ఆయన వివరించారు.