కడలూరులో ఘోరం | - | Sakshi
Sakshi News home page

కడలూరులో ఘోరం

Jul 9 2025 7:05 AM | Updated on Jul 9 2025 7:05 AM

కడలూర

కడలూరులో ఘోరం

సేలం: లెవల్‌ క్రాసింగ్‌లో ఉన్న గేట్‌ను మూయకుండా కీపర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ముగ్గురు విద్యార్థులు బలయ్యారు. అతివేగంగా వస్తున్న ప్యాసింజర్‌ రైలును గుర్తించకుండా స్కూల్‌ వ్యాన్‌ను డ్రైవర్‌ ముందుకు తీసుకెళ్లడంతోనే మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో విల్లుపురం – మైలాడుతురై మార్గంలో రైళ్ల సేవలకు తీవ్ర ఆటంకం నెలకొంది. వివరాలు.. కడలూరు జిల్లా సెమ్మంకుప్పం గ్రామం సమీపంలోని ఆలపాక్కం వద్ద రైల్వే క్రాసింగ్‌ ఉంది. సెమ్మంకుప్పం నుంచి ఉదయాన్నే నలుగురు విద్యార్థులను ఎక్కించుకుని కుమార పురానికి చెందిన ఓ ప్రైవేటు వ్యాన్‌ డ్రైవర్‌ శంకర్‌ బయలుదేరాడు. సరిగ్గా 7.45 గంటల సమయంలో అక్కడి రైల్వే క్రాసింగ్‌ను దాటుతుండగా విల్లుపురం నుంచి మైలాడుతురై వైపుగా 95 కి.మీ వేగంతో వస్తున్న ప్యాసింజర్‌ రైలు ఢీ కొంది. రైలు ఢీ కొన్న వేగానికి ఆ వ్యాన్‌ 50 అడుగుల దూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనను చూసిన అటు వైపుగా వెళ్తున్న ఓ రైతుతో పాటుగా మరో ఇద్దరు పెట్టిన కేకలతో ఆలపాక్కం, సెమ్మంకుప్పం గ్రామల నుంచి జనం పరుగులు తీశారు. వ్యానులో రక్తగాయాలతో పడి ఉన్నపిల్లలను రైతు రక్షించే క్రమంలో విద్యుత్‌ తీగలు తెగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో వ్యాన్‌ వద్దకు వెళ్లేందుకు జనం సాహసించ లేని పరిస్థితి ఏర్పడింది.

భిన్న వాదనతో కలకలం

రైల్వే గేట్‌ కీపర్‌గా పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన పంకజ్‌ శర్మ రైలు వస్తున్న సమయంలో గేట్‌వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలింది. అతడు నిద్రలో ఉన్నట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గేట్‌ తెరిచి ఉండడంతోనే వ్యాన్‌ ముందుకెళ్లినట్టు పేర్కొంటున్నారు. క్రాసింగ్‌ ఉన్న చోట కనీసం రైలు డ్రైవర్‌ హారన్‌ కూడా కొట్టనట్టుగా డ్రైవర్‌ శంకర్‌ ఆరోపించాడు. అయితే గేట్‌ కీపర్‌ పంకజ్‌ వాదన మరో విధంగా ఉండటం గమనార్హం. గేట్‌ మూస్తున్న సమయంలో వ్యాన్‌తో పాటూ మరో రెండు మోటారు సైకిళ్లు వచ్చాయని,రైలు వచ్చేలోపు వెళ్లి పోతామని బలవంతం చేసి గేటు మూయనివ్వకుండా చేశారని గేట్‌ కీపర్‌ పేర్కొనడంతో రైల్వే అధికారులు తమ తప్పు లేదన్నట్టుగా వ్యాఖ్యలు అందుకున్నారు. చివరకు వ్యవహారం ఉత్కంఠకు, వివాదానికి దారి తీయడంలో గేట్‌ కీపర్‌ను సస్పెండ్‌ చేశారు. అదే సమయంలో పోలీసులు అతడ్ని అరెస్టుచేశారు. రైల్వే అధికారులు, జిల్లా అఽధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. సుమారు ఐదు గంటల అనంతరం రైలు సేవలను పునరుద్ధరించారు.

స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న రైలు

ముగ్గురు విద్యార్థుల బలి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

గేట్‌ మూయకుండా కీపర్‌ నిర్లక్ష్యం

తీవ్ర ఉత్కంఠ..

అతి కష్టంపై వ్యాన్‌ను సమీపించారు. నుజ్జునుజ్జయిన వ్యాన్‌ నుంచి చెల్లా చేదరుగా పుస్తకాలు, బ్యాగ్‌లు పడి ఉండటంతో పాటుగా ఓ విద్యార్ధి మృత దేహం సైతం పట్టాల మీద కనిపించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వ్యాన్‌లో ఉన్నపిల్లల పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన తప్పలేదు. చివరకు వ్యాన్‌లో ఉన్ననలుగురు విద్యార్థులు, డ్రైవర్‌శంకర్‌ను అతి కష్టంమీద అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఈ సమాచారంతో కడలూరు జిల్లా యంత్రాంగం, రైల్వే వర్గాలు ఉరకలు తీశాయి. మంత్రి సీవీ గణేషన్‌ హుటా హుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను, వారి కుటుంబాలను ఓదార్చారు. నుజ్జు నుజ్జైన వ్యాన్‌ను అక్కడి నుంచితొలగించారు.తెగి పడ్డ విద్యుత్‌ తీగలను తొలగించారు. విద్యుత్‌ లైన్లకు మరమ్మతుల మీద దృష్టి పెట్టారు. కూతవేట దూరంలో ఆగిన ప్యాసింజర్‌ రైలుతో పాటూ విల్లుపురం వైపుగా మైలాడుతురై నుంచి రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆపేశారు.విల్లుపురం నుంచి వెళ్లాల్సిన రైళ్లు ఆగాయి. ఈ ప్రమాదంలో మరణించిన చారుమతి, చెలియన్‌ అక్క, తమ్ముడిగా తేలింది. ప్లస్‌ ఒన్‌,పదో తరగతి వీరిద్దరు చదువుతున్నారు. దీంతో ఆకుటుంబ తీవ్ర శోక సంద్రంలో మునిగింది. అలాగే మరో విద్యార్ధి విశ్వేష్‌గా గుర్తించారు. అతడి సోదరుడు నివాస్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు.డ్రైవర్‌ శంకర్‌కు సైతం చికిత్స అందిస్తున్నారు.

కడలూరులో ఘోరం1
1/2

కడలూరులో ఘోరం

కడలూరులో ఘోరం2
2/2

కడలూరులో ఘోరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement