
పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
వేలూరు: విద్యార్థినులు పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి అన్నారు. కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల యూనియన్ 71వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిప ల్ సిస్టర్ ఆరోగ్య జయశీలి అధ్యక్షతన ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులు పట్టుదలతో ప్రయత్నం చేస్తే జీవితంలో అభివృద్ధి చెందగలరన్నారు. కార్యక్రమంలో అగ్జిలియమ్ కళాశాల కార్యదర్శి మేరి జోసెఫిన్ రాణి, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ నాగరాజన్, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్‌లు పాల్గొన్నారు.