
వీఐటీ చాన్స్‌లర్‌కు అభినందన
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ విశ్వనాథన్‌కు అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో చాన్స్‌లర్ విశ్వనాథన్‌ను కాట్పాడి రెడ్‌క్రాస్ సభ్యులు నేరుగా కలిసి అభినందించారు. ఈసందర్భంగా కాట్పాడిలోని రెడ్‌క్రాస్ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను చాన్స్‌లర్ అడిగి తెలుసుకున్నారు. కాట్పాడి రెడ్‌క్రాస్ సంఘం అద్యక్షుడు జనార్దన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసన్, విజయకుమారి, కోశాధికారి పయణి, వైద్యవిభాగం అధ్యక్షుడు డాక్టర్ దీనబందు, కార్యదర్శి శివవడివు, రామచంద్రన్ పాల్గొన్నారు.
రగ్బీ ప్రీమియర్ లీగ్‌కు
క్యాప్ జెమిని
సాక్షి, చైన్నె: రగ్బీ ప్రీమియర్ లీగ్‌కు భాగస్వామిగా క్యాప్‌జెమిని ఎంపికై ంది. ఈవివరాలను గురువారం స్థానికంగా ప్రకటించారు. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ (ఐఆర్‌ఎఫ్‌యూ), జీఎంఆర్ స్పోర్ట్స్ సహకారంతో క్యాప్‌జెమిని రగ్బీ ప్రీమియర్ లీగ్‌ను రూపొందించడంలో సాయం అందించే విధంగా ప్రొఫెషనల్ రగ్బీకి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్టు ప్రకటించారు. దేశంలో రగ్బీలో భాగస్వామ్యం , అవగాహనలో స్థిరమైన పెరుగుదల కనిపించినట్టు, ఈ పరిచయం ఇప్పుడు ఒక సాహసోపేతమైన అడుగు ముందుకు వేసిందని వివరించారు. యువతకు టాప్ ఐదు క్రీడలలో ఒకటిగా రగ్బీ నిలిచిందని, రగ్బీతో క్యాప్‌జెమిని అనుబంధం గురించి ఆ సంస్థ సీఈఓ అశ్విన్‌యార్డి మాట్లాడుతూ జట్టు స్ఫూర్తి, ధైర్యమైన ఆలోచన, నాయకత్వం, ఆవిష్కరణ నిజమైన ఆనందంగా పేర్కొన్నారు. క్రీడలతో తమ భాగస్వామ్యం మైదానంలో, వెలుపల నిబద్ధతను మరింత బలోపేతం చేసిందన్నారు. ఐఆర్‌ఎఫ్‌యూ అధ్యక్షుడు రాహుల్ బోస్, జీఎంఆర్ స్పోర్ట్స్ సీఈఓ సత్యం త్రివేది 2025 రగ్బీ సీజన్ గురించి వివరించారు.
దక్షిణరైల్వేలో అధికార భాషా కమిటీ భేటీ
సాక్షి, చైన్నె: జోనల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ 176వ సమావేశం దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగింది. దక్షిణ రైల్వే అదనపు జనరల్ మేనేజర్ కౌశల్ కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాలబికా జి.మోహన్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ హరి కృష్ణన్, సదరన్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సీఎం రవి, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మధుసూదనన్ తదితర రైల్వే అధికారులు హాజరయ్యారు. దక్షిణ రైల్వే వైద్య విభాగం సమన్వయంతో అధికారిక భాషలో తయారు చేసిన నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ హెల్ప్ లిటరేచర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు.
కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు