
సౌరశక్తి కారు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు విద్యార్థుల బృందం సౌరశక్తితో నడిచే కారును సిద్ధం చేసింది. గ్లోబల్ పోటీలకు ఈ కారును సన్నద్ధం చేస్తూ, దీనికి ఆగ్నేయ అని నామకరణం చేసి ఆవిష్కరించారు. వివరాలను శుక్రవారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. ఆగ్నేయ అని పిలవబడే ఈ కారును సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ నుంచి టీం అగ్నిరథ్ బృందం అభివృద్ధి చేసింది. డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3వేల కి.మీ డ్రైవ్‌ను కలిగి ఉన్న బ్రిడ్జ్‌స్టోన్ వరల్డ్ సోలార్ చాలెంజ్–2025లో పాల్గొనడానికి ఈకారు సిద్ధంగా ఉంది. 2025 ఆగస్టు 24 నుంచి 31 వరకు జరగనున్నదని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి చైన్నె క్యాంపస్‌లో ఆగ్నేయ సోలార్ పవర్ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్.గుమ్మడి, అగ్నిరథ్ ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎంఎస్ శివకుమార్, టీమ్ అగ్నిరథ్ విద్యార్థులు, సీఎఫ్‌ఐ సిబ్బంది, టీమ్ స్పాన్సర్లు సహా ఇతర వాటాదారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
స్టార్టప్‌ల మద్దతుతో..
టీమ్ అగ్నిరథ్ అభివృద్ధి చేసిన సాంకేతికతపై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ ఈ బృందం విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కారు ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే, తమకు వనరులు అవసరమని వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి, మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి తాము బలమైన యంత్రాంగాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఇటీవల ఐఐటీ మద్రాస్–ఇంక్యుబేట్ స్టార్టప్ నుంచి తమకు మొదటి ఐపీఓ వచ్చిందన్నారు.
గర్వకారణమైన క్షణం
సీఎఫ్‌ఐ, ఐఐటీ మద్రాసులోని టీమ్ అగ్నిరథ్ ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎంఎస్ శివకుమార్ మాట్లాడుతూ, ఇది గర్వకారణమైన క్షణంగా పేర్కొంటూ, బృందంలోని సభ్యులందరూ ఆగ్నేయను రూపొందించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించి అంకిత భావంతో పనిచేశారని వివరించారు.
గ్లోబల్ కంటెంట్ గురించి..
గ్లోబల్ కంటెంట్ గురించి టీమ్ అగ్నిరథ్, బిజినెస్ మాడ్యూల్ లీడ్, ఐఐటీ మద్రాస్‌లోని బయాలాజికల్ సైన్స్ మూడవ సంవత్సరం విద్యార్థి సాయిరామ్ జె. మాట్లాడుతూ బ్రిడ్జ్‌స్టోన్ వరల్డ్ సోలార్ చాలెంజ్ కేవలం ఒక రేసు కంటే చాలా ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఇంజినీరింగ్ పోటీగా గుర్తించబడిందన్నారు. ఈ సంవత్సరం తాము ఆగ్నేయను పరిచయం చేయడానికి గర్వపడుతున్నామన్నారు. దేశంలో ఒక విద్యార్థి బృందం ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద హ్యాండ్ లేఆఫ్ ప్రక్రియల్లో ఇది ఒకటిగా నిలిచిందన్నారు. ఈవిష్కరణలన్నీ 15వేల గంటలకు పైగా కృషి, శ్రమతో తీర్చిదిద్దబడిందన్నారు.
సాంకేతిక వివరాలు..
ముఖ్యంగా గేమ్ చేంజ్ సోలార్, బిలియన్ మొబిలిటీ, చార్జ్‌జోన్, కోజెట్ వంటి స్పాన్సర్ల అద్భుతమైన మద్దతు లేకుండా టీం అగ్నిరథ్ ప్రయాణం సాధ్యం కాదని పేర్కొన్నారు సౌర పలక సామ ర్థ్యాన్ని 19 శాతం నుంచి 24 శాతానికి అప్‌గ్రేడ్ చేయడంతో వేరియబుల్ పరిస్థితుల్లో కూడా ఎక్కు వ శక్తిని ఉపయోగించుకోగలుగుతామన్నారు. కారు కు బ్యాటరీ ప్యాక్ కూడా ఆప్టిమైజ్ చేశారన్నారు.
ఐఐటీ మద్రాసు విద్యార్థుల
ఆవిష్కరణ
గ్లోబల్ పోటీల కోసం సన్నద్ధం

సౌరశక్తి కారు