ఉమ్మడి కోర్టు ఆవరణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కోర్టు ఆవరణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

Jun 11 2025 8:56 AM | Updated on Jun 11 2025 8:56 AM

ఉమ్మడి కోర్టు ఆవరణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

ఉమ్మడి కోర్టు ఆవరణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

తిరువళ్లూరు: ఉమ్మడి కోర్టు ఆవరణలో హఠాత్తుగా విద్యుత్‌ వైర్లులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు రేగాయి. దీంతో న్యాయవాదులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తిరువళ్లూరు ఉమ్మడి కోర్టు ఆవరణలో తాగునీటి సదుపాయం కోసం మున్సిపాలిటీ అధికారులు జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో జేసీబీ తవ్వకాలు చేస్తున్న సమయంలో విద్యుత్‌ వైర్లు ఒకదానికొకటి తగలడంతో తెగి, కిందపడి మంటలు వ్యాపించాయి. విద్యుత్‌ వైర్లు నుంచి హఠాత్తుగా చెలరేగిన మంటలతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో కోర్టు ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సరఫరా ఆపివేశారు. కాలిపోయిన వైర్లను తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేసి, విద్యుత్‌ను పునరుద్ధరించారు.

కాలిపోయిన విద్యుత్‌ తీగలు

ఆందోళనకు గురైన ప్రజలు,

న్యాయవాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement