
గ్రేటర్ చైన్నె పోలీసులోకి 11 శునకాలు
సాక్షి, చైన్నె : గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనరేట్ పరిధిలోని డాగ్ స్క్వాడ్ యూనిట్‌లోకి 11 శునకాలను కొత్తగా తీసుకొచ్చారు. వీటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ నేతృత్వంలో అదనపు కమిషనర్ పర్యవేక్షణలో డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి కీల్పాకం డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ రెజిమెంట్ పేరుతో మరొకటి సెయింట్ థామస్ మౌంటైన్ డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ రెజిమెంట్‌గా పనిచేస్తున్నాయి. కీల్పాకం డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ 16 శునకాలు ఉన్నాయి. ఇందులో 11 బాంబులును గుర్తించడంలో శిక్షణ పొంది ఉన్నాయి. మరో మూడు పలు నేరాల్లో కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించాయి. మరికొన్ని మాదక ద్రవ్యాల గుర్తింపులో ప్రత్యేక శిక్షణ పొందాయి. ఇక, సెయింట్ థామస్ ిడాగ్ స్క్వాడ్ 7 డిటెక్టివ్ స్నిఫర్ డాగ్‌లున్నాయి. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కమిషనర్ అరుణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా 11 శునక పిల్లలను కొనుగోలు చేశారు. వీటిలో లాబ్రడార్, బెల్జియన్ మాలినోయిస్, డాబర్మాన్ ఉన్నాయి. ఇందులో ఆరింటిని బాంబుల గుర్తింపునకు , మరో నాలుగింటిని మాదకద్రవ్యాల గుర్తింపునకు, మరొకటి క్రిమినల్ కేసుల ఛేదనకు ఉపయోగపడేలా శిక్షణ ఇవ్వనున్నారు. చైన్నె మెట్రోపాలిటన్ అదనపు కమిషనర్ విజయేంద్ర బిధారి నేతృత్వంలో సోమవారం ఎగ్మూర్ రాజరత్నం స్టేడియంలో పోలీస్ స్నిఫర్ డాగ్ యూనిట్‌కు కొత్తగా చేరిన శునక పిల్లలను పరిచయం చేశారు. లాబ్రడార్, బెల్జియం, మాలినోయిస్, డాబర్‌మాన్, జర్మన్ షెప్పర్డ్ మూడు నెలల పిల్లలుగా ఉన్నాయి. ఇందులో 8 మగ, మూడు ఆడ శునకాలున్నాయి. వీటికి వెట్రి, విక్రమ్, నిత్ర, ముగిలన్, సిలంబన్, కురళి, కారి, కుగన్, వెంబా, ధీరన్, అలెగ్జాండర్ అని నామకరణం చేశారు. వీటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పోలీసు విభాగంలో చేరికకు గాను ఈ శునక పిల్లలకు వాటి పేర్లతో కూడిన డాలర్లను సమర్పించారు.
● శిక్షణకు ఏర్పాట్లు