షూటింగ్‌లో చాలా ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో చాలా ప్రమాదాలు

Jun 8 2025 1:05 AM | Updated on Jun 8 2025 1:05 AM

షూటిం

షూటింగ్‌లో చాలా ప్రమాదాలు

తమిళసినిమా: షట్టర్‌ ఫ్రేమ్స్‌ పతాకంపై బిపిన్‌ మిట్టాదిల్‌ నిర్మించిన చిత్రం హోలోకాస్ట్‌. నటుడు జయకృష్ణన్‌, షర్మిళ, నందన్‌ ఉన్ని, తన్వీ వినోద్‌, మితున్‌ వెంపలక్కల్‌, ప్రీతీ జినో, నజ్రిన్‌ నజీర్‌ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను విష్ణు చంద్రన్‌ నిర్వర్తించారు. విపిన్‌రాజ్‌ చాయాగ్రహణం, శ్యామ్‌మోహన్‌ ఎం సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈనెల 13న తెరపైకి రానుంది. కాగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్‌ హర్రర్‌ కథా చిత్రమని చెప్పారు. 6 రోజుల్లో జరిగే ఈ చిత్ర కథ ఇన్సిడియల్‌, ఈవిల్‌ డెత్‌ వంటి హర్రర్‌ చిత్రాల తరహాలో సాగే ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. సాధారణంగా ఇలాంటి హారర్‌ కథా చిత్రాల షూటింగ్‌ సమయంలో పలు అమానుష సంఘటనలు జరిగినట్లు వింటుంటామన్నారు. అయితే ఆ చిత్ర కథను రాయడం ప్రారంభించినప్పుడే పలు రకాల ఆటంకాలను ఎదుర్కొన్నానని చెప్పారు. వాటిని అధిగమించి షూటింగ్‌కు సిద్ధమయ్యామని చెప్పారు. ఈ చిత్రంలో ఎలీషా కథా పాత్ర చాలా ముఖ్యమైనదని, ఈ పాత్రను చిత్రీకరిస్తున్నప్పుడు బలమైన గాలీవాన వచ్చిందన్నారు. నిజంగానే తాము ఆ సన్నివేశాలను రెయిన్‌ ఎఫెక్ట్‌లో చిత్రీకరించాలని భావించామని, అయితే బడ్జెట్‌ అధికం అవుతుందని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని తెలిపారు. కేరళలో షూటింగ్‌ను నిర్వహించి పూర్తిచేసినట్లు చెప్పారు. ఈ నెల 13న తెరపైకి రానున్న హోలోకాస్ట్‌ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పేర్కొన్నారు.

షూటింగ్‌లో చాలా ప్రమాదాలు1
1/1

షూటింగ్‌లో చాలా ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement