
సహకార దుకాణానికి అనుమతి
తిరువళ్లూరు: పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా సహకార శాఖ ఆధ్వర్యంలో దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తూ సహకార శాఖ మండల జాయింట్ రిజిస్ట్రార్ షణ్ముగవళ్లి ఉత్తర్వులను అందజేశారు. తిరువళ్లూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు వైద్యశాల అనుబంధంగా పనిపనిచేస్తోంది. మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా సహకార శాఖ ఆధ్వర్యంలో దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దుకాణం ఏర్పాటుకు సంబందించిన ఉత్తర్వులను మెడికల్ కళాశాల అధికారులకు మండల జాయింట్ రిజిస్ట్రార్ షణ్ముగవళ్లి అందజేశారు. డిప్యూటీ రిజిస్ట్రార్‌లు శ్రీనివాసన్, అముద, కమిల, మెడికల్ కళాశాల అధికారి ప్రసన్న పాల్గొన్నారు.