
ప్రపంచ రికార్డు కోసం డెవిల్
తమిళసినిమా: మంచి కుటుంబ కథా చిత్రాలు, కమర్షియల్ కథా చిత్రాలకు మధ్య అరుదుగా సినీ పుటల్లో మనముండాలి అనే కొందరు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారు గిన్నీస్, వరల్డ్ రికార్డు, లిమ్కా బుక్ రికార్డుకెక్కే చిత్రాలను తీస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు అరుదుగా రూపొందుతుంటాయి. అలా తాజాగా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం డెవిల్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని 48 గంటల్లో షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు షూటింగ్‌ను ప్రారంభించి శనివారం సాయంత్రం 3 గంటలకు షూటింగ్, తర్వాత నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 31వ తేదీన సాయంత్రం దథియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు బిక్కయ్ అరుణ్ పేర్కొన్నారు. సీకర్ పిక్చర్స్ సంస్థ అధినేతలు కమకుమారి, ఎన్.రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో కార్తీక, ఇందిర నాయకిలుగా నటిస్తున్నారు. టీజే.బాలా చాయాగ్రహణం, కమల్‌జిత్ సింగ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 48 గంటల్లో చిత్రం విడుదల చేసే ఈ ప్రయత్నం సవాల్‌తో కూడినదే అయినా సాధించి తీరుతామనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. తాను ఇంతకుముందు ఏడేళ్లు మీడియాలో పనిచేశానని, ఈ చిత్రం కోసం ఏడాదిగా శ్రమించానని చెప్పారు.