రజనీ చిత్రాల్లో ఇతర స్టార్స్‌ | - | Sakshi
Sakshi News home page

రజనీ చిత్రాల్లో ఇతర స్టార్స్‌

May 30 2025 1:06 AM | Updated on May 30 2025 1:06 AM

రజనీ చిత్రాల్లో ఇతర స్టార్స్‌

రజనీ చిత్రాల్లో ఇతర స్టార్స్‌

తమిళసినిమా: దక్షిణాదిలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటుడు రజనీకాంత్‌. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం అంటేనే బయ్యర్లు ఆ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి క్యూ కడతారు. అలాంటి రజనీకాంత్‌ ఆ మధ్య నటించిన దర్బార్‌, అన్నాత్త వంటి భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు నిరాశపరచడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రజనీకాంత్‌ దృక్పథం మారిందో, కథ డిమాండ్‌ కారణంగానో తనకు సపోర్ట్‌గా ఇతర భాషలకు చెందిన స్టార్స్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా రజనీ నటించిన జైలర్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో రజనీకాంత్‌ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది .అయితే ఆ ఫార్ములా వేట్టైయాన్‌ చిత్రానికి బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఆ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి బాలీవుడ్‌ అమితాబ్‌బచ్చన్‌, మలయాళ స్టార్‌ ఫాహత్‌ ఫాజిల్‌, టాలీవుడ్‌ స్టార్‌ రాణా వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. అయినా రజనీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న కూలీ చిత్రంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌, టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున, శ్రుతిహాసన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం రజనీ జైలర్‌–2 చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోనూ ఇతర భాషలకు చెందిన ప్రముఖ స్టొర్స్‌ నటించడం విశేషం. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌, టాలీవుడ్‌ టాప్‌స్టార్‌ బాలకృష్ణ నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నాగార్జునను కూడా ముఖ్య పాత్రల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. అదేవిధంగా ధనుష్‌తో కలిసి కుబేర చిత్రంలో నటించారన్నది గమనార్హం.

నాగార్జున, రజనీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement