మూడో కేటగిరి జీవితాల్లో వెలుగు | - | Sakshi
Sakshi News home page

మూడో కేటగిరి జీవితాల్లో వెలుగు

May 26 2025 12:17 AM | Updated on May 26 2025 12:17 AM

మూడో కేటగిరి జీవితాల్లో వెలుగు

మూడో కేటగిరి జీవితాల్లో వెలుగు

● ట్రాన్స్‌ జెండర్ల కోసం బృహత్తర పథకాలు ● అద్భుత ప్రణాళికతో ముందుకు ● సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదేశాలతో ప్రగతి నివేదిక

సాక్షి,చైన్నె : Í…VýS-Ð]l*-Ç-µyìl Ð]lÅMýS$¢ÌS iÑ-™éÌZÏ ÐðlË$VýS$ °…õ³ Ñ«§ýl…V> ç³° ^ólĶæ$-yýl…, º–çßæ-™èl¢Æý‡ ç³£ýl-M>-ÌS¯]l$ ÑçÜ–¢™èl… ^ólĶæ$yýl…ÌZ {§éÑyýl Ððl*yýlÌŒæ Ð]l¬…§ýl…-f…ÌZ E…§ýl° Æ>çÙ‰ {糿¶æ$™èlÓ… {ç³MýS-sìæ…-_…-¨. ¯éË$-VóSâýæÏ yîlG…MóS ´ëÌS¯]lÌZ {sꯌSÞ gñæ…yýlÆý‡Ï MøçÜ… AÐ]l$Ë$ ^ólíܯ]l {sꯌSÞ gñæ…yýlÆŠ‡ ÐðlÌôæ¹ÆŠ‡ »ZÆý‡$z, ò³¯]lÛ-¯Œl, {ç³™ólÅMýS AÐé-Æý‡$zË$, çÜÓĶæ$… E´ë«¨ çÜ¼Þ yీ , ѧéÅ MýSÌSÌS {´ëgñæMýS$t Ððl¬§ýl-OÌñæ¯]lÑ A§ýl$Â-™èl-OÐðl$¯]l {ç³×êã-MýS-ÌS™ø °Ðól-¨-MýS¯]l$ ïÜG… ÝëtͯŒS B§ól-Ô>ÌS™ø B¨ÐéÆý‡… Ñyýl$§ýlÌS ^ólÔ>Æý‡$. D ç³£ýl-M>-ÌS™ø Í…VýS-Ð]l*-Ç-µyìl Ð]lÅMýS$¢Ë$ iÑ-™èl…ÌZ AÀ-Ð]l–¨® ÐólVýS… ç³#…k-MýS$-¯]l²r$t ÑÐ]l-Ç…^éÆý‡$.

సమాజంలో సభ్యులే..

ఈ సమాజంలో సభ్యులే అని , రాష్ట్రంలో భాగంగా వారి సంక్షేమాన్ని నిర్ధారించడానికి తమిళనాడు అరవాణి సంక్షేమ బోర్డును 2008లో కలైంజ్ఞర్‌ కరుణానిధి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ సంక్షేమ పథకాలు ఈ బోర్డు ద్వారా అందిస్తూ వస్తున్నామని వివరించారు. అరవాణిల పేరు కూడా ట్రాన్స్‌జెండర్లుగా ప్రకటించామన్నారు. సంక్షేమ బోర్డును ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డుగా నామకరణం చేశామని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డులో 15 మంది అధికారిక సభ్యులు ఉన్నారని వీరిలో 10 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నట్టు గుర్తు చేశారు. ట్రాన్స్‌ జెండర్లకు గుర్తింపు కార్డులు, కుటుంబ కార్డులు, ఇంటి హక్కు పత్రం, వైద్య భీమా కార్డులు,కుట్టు యంత్రాలు, సొంత వ్యాపారం ప్రారంభించేందుక స్వయం సహాయ బృందాల ఏర్పాటు, శిక్షణ, సబ్సిడీ, పేదరికంలో ఉన్న 40 ఏళ్లు పైబడ్డని వారికి సదుపాయాలు, పెన్షన్లు వంటి వివిధ సంక్షేమ పథకాలతో సహకారం అందిస్తూ వస్తున్నామని వివరించారు. పేద ట్రాన్స్‌జెండర్‌లకు నెలకు రూ. 1000 నగదు ప్రోత్సహ పథకం విజయవంతంగా అమల్లో ఉన్నట్టు వివరించారు. 2022–2023లో 1,311, 2023–2024లో 1,482, 2024–2025లో 1,599 మంది ట్రాన్స్‌ జెండర్లకు పెన్షన్లను అందించడం జరిగిందన్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి 1,760 మంది ట్రాన్స్‌జెండర్లు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు.

మొబైల్‌ యాప్‌..

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, అందరు ట్రాన్స్‌జెండర్లు వారి ప్రొఫైల్‌లను నమోదు చేసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రయత్నంగా 2021 సంవత్సరంలో ట్రాన్స్‌జెండర్‌ అనే మొబైల్‌ అప్లికేషన్‌ సృష్టించినట్టు వివరించారు. ట్రాన్స్‌ జెండర్ల వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతోందన్నారు. తద్వారా 10,153 మంది లింగమార్పిడి వ్యక్తులకు గుర్తింపు కార్డులు ఉన్నట్టు వివరించారు. ట్రాన్స్‌జెండర్లను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. విద్యాపరంగా, వివిధ వృత్తుల పరంగా, వివిధ రంగాలలో పురోగతి సాధించడం, తమ సమాజాభ్యున్నతికి వారిలో సేవ చేస్తూ, ఆదర్శంగా నిలిచిన ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 15న ట్రాన్స్‌జెండర్‌ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవార్డులతో రూ. లక్ష నగదుకు గాను చెక్కును అందజేస్తున్నామన్నారు. 2021లో తూత్తుకుడి జిల్లాకు చెందిన గ్రేస్‌ బాను అనే ట్రానన్స్‌జెండర్‌కు, 2022న విల్లుపురం జిల్లా ఎ. మర్లిమా అనే ట్రాన్స్‌జెండర్‌కు 2023లో వేలూరుక చెందిన బి. ఐశ్వర్యకి, 2024లో కన్యాకుమారికి చెందిన సంధ్యాదేవికి, 2025లో తూత్తుకుడికి చెందిన పొన్నీ, నామక్కల్‌కు చెందిన రేవతిలకు ఈ అవార్డులను అందజేసి సత్కరించామన్నారు. లింగమార్పిడి వ్యక్తుల జీవనోపాధిని ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపరచడానికి, వారికి గుర్తింపు ఇచ్చే లక్ష్యంతో, వారికి వారు స్వంత వారు వ్యాపారాన్ని ప్రారంభించడానికి సబ్సిడీలను అందించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. దీని ద్వారా రూ. 50 వేలు అందజేయడం జరుగుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 811 మంది ట్రాన్స్‌జెండర్లు స్వయం ఉపాధి పొందారని, వీరి కోసం విద్యాకలల ప్రాజెక్ట్‌ను సైతం దిగ్విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. తమిళనాడులో అందరినీ అన్నీఅన్నదే తమ నినాదం అని, లింగమార్పిడి సమాజం కూడా ఆత్మగౌరవంతో జీవించడానికి వివిధ ప్రత్యేక కార్యక్రమాలు మరింతగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివిధ కార్యక్రమాలు, స్వయం ఉపాధి తో ట్రాన్స్‌జెండర్లు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, ఇలాంటి బృహత్తర పథకాల ఉత్తమ ప్రభుత్వం తమది అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement