
గ్రీవెన్స్‌డేకు 314 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 314 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించి కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. పట్టాలు కోసం 123 వినతులు, పక్కాగృహాలు 55, ఉపాధి 63, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వసతుల కల్పించాలని 25 వినతులతో కలిపి మొత్తం 314 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మూడుచక్రాల వాహనం కోసం వినతి పత్రం సమర్పించిన వికలాంగులరాలికి తక్షణం రూ.15,400 విలువ చేసే వాహనాన్ని అందజేశారు. 2021లో కృష్ణాకాలువలో పడి మృతి చెందిన ప్రణేష్ అనే బాలుడి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయం రూ.లక్ష చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.