
చైన్నెలో గైడ్‌హౌస్ సేవలు
సాక్షి, చైన్నె: వాణిజ్య, ప్రభుత్వ రంగాలకు సేవలందిస్తున్న ప్రపంచ సలహా, సాంకేతికత నిర్వహణ సేవల సంస్థ గైడ్‌హౌస్ చైన్నెలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. చైన్నెలోని పోరూర్‌లోని కెప్పెల్ వన్ పారామౌంట్‌లో కొత్త సౌకర్యాలతో సేవలను ప్రారంభించింది. ఆవిష్కరణ, సామర్థ్యం కోసం రూపొందించబడిన కొత్త క్యాంపస్, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల సమూహంతో నిరంతర సేవలను అందించనున్నారు. గైడ్‌హౌస్ ఇండియా భాగస్వామి, కంట్రీ హెడ్ మహేంద్ర రావత్ తమ సేవల విస్తరణ గురించి మాట్లాడుతూ, ఇది గైడ్‌హౌస్ అతిపెద్ద కార్యాలయం అని, దీనిని ప్రజలు , ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా నిర్మించామన్నారు. తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రెండు సిఫ్టులలో ఇక్కడ 5 వేల మంది ఉద్యోగులు ఉంటారని, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, సాంకేతికత , కార్పొరేట్ మద్దతు విధులలో గైడ్‌హౌస్ సేవలు ఉంటాయని వివరించారు. ప్లాటినం–సర్టిఫైడ్ సౌకర్యం, సౌకర్యవంతమైన వర్క్‌స్టేషన్‌లు, వెల్‌నెస్ జోన్‌లు, గ్రీన్ ల్యాండ్‌స్కేప్‌లు, ప్రీమియం వర్క్‌స్పేస్ జీవనశైలి సౌకర్యాలను అందిస్తామన్నారు. ఆవిష్కరణ, సహకారానికి కేంద్రంగా తమ నిబద్ధతను బలోపేతం చేస్తామన్నారు.