
మెంబర్స్ వాయిస్ పేరిట ఆస్కాలో పోటీ
–జి.శశిధర్‌రెడ్డి
సాక్షి, చైన్నె: ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఎన్నికల్లో మెంబర్స్ వాయిస్ పేరిట తాము పోటీ చేస్తున్నామని అధ్యక్ష అభ్యర్థి జి.శశిధర్‌రెడ్డి తెలిపారు. తమ జట్టును శుక్రవారం సాయంత్రం ఆస్కా ఆవరణలో ఆయన పరిచయం చేశారు. శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఆస్కా కార్యవర్గం ఎంపికకు ఎన్నికలు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. 2,600 మందికి పైగా సభ్యులు ఆస్కాలో ఉన్నట్టు వివరించారు. తమను గెలిపిస్తే ఆస్కా సంస్థను మరింతగా అభివృద్ధి పరిచేలా ముందుకెళ్తామన్నారు. సభ్యులందరూ ఓటు హక్కును వినియోగించుకుని తమ జట్టును బలపరచాలని కోరారు. తమ జట్టు తరఫున ప్రధాన కార్యదర్శిగా వడ్లమూడి దిలీప్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా వై.రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా మాదాల వెంకటసుబ్బారావు, కోశాధికారిగా ఎల్.శాంతకుమార్, సినీ నటుడు ఎం.భానుచందర్, కల్చరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారని వివరించారు. అలాగే, రవిచందర్, చలపతి, మదనగోపాల్ రావు, ప్రేమ్‌కుమార్, రమేష్‌రెడ్డి, దుర్గా ప్రసాద్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజేష్, శ్రీనివాస్‌లు కమిటీ సభ్యులుగా, ట్రస్టీలుగా ఎం.శ్రీనివాసరావు, కోటారెడ్డి వేమిరెడ్డి, వి.విజయేంద్రరావు, సంతోష్‌కుమార్, కోటేశ్వరరావు, మనోహర్‌రెడ్డి, ఎన్‌ఎన్ భిక్షం, వి.బాలాజీ, ప్రశాంత్ తమ జట్టు తరపున పోటీ చేయనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల వాగ్దానాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. మాజీ అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య పాల్గొన్నారు.