
నెమళ్ల మృత్యుగీతం
కుప్పం రూరల్ : కుప్పం మండలం, పెద్దబంగారునత్తం పరిసరాల్లో నెమళ్లు రాలిపోతున్నాయి. పెద్దబంగారునత్తం సమీపంలోని మార్వాడ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద నెమళ్లు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆహారం కోసం అక్కడి నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని ఇటువైపు పొలాల్లోకి వస్తున్నాయి. బెంగళూరు – చైన్నె రైల్వే లైన్ దాటుకుని రావాల్సి ఉంది. ఈ క్రమంలో నెమళ్లు రైల్వే విద్యుత్ లేన్లకు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిత్యం ఒకటి రెండు నెమళ్లు పడిపోయి దర్శనమిస్తున్నాయి. నిత్యం నెమళ్లు రైల్వే ట్రాక్‌పై పడిి ఉండడాన్ని చూసి స్థానికుల మనసు కలిచి వేస్తోంది. అటవీశాఖ అధికారులు అయినా నెమళ్లు ఇటు వైపుకు రాకుండా చూడాలని కోరుతున్నారు.