
ఎవరితోనూ శతృత్వం ఇల్లే!
1.38 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
గరుడ వాహన సేవలో గోవిందుడు
సాక్షి, చైన్నె : ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయం గానీ, శతృత్వంగానీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ ఆర్‌ఎన్ రవిను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తనకు తమిళనాడు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్య అంశాలను ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వ న్యాయ పోరాటం గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రాల హక్కుల కోసం జరిగే చట్టపరమైన పోరాటాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్మ్రాతక మైలు రాయిగా వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, శాసన సభ ఆమోదించిన తీర్మానాన్ని ఆమోదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే గవర్నర్లకు గుణపాఠం కావాలని, ఈ తీర్పు రాజ్యాంగాన్ని పరిరక్షించిందన్నారు. తమిళనాడు ప్రభుత్వ కేసులో వెలువడిన ఈ తీర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులకు బలాన్ని చేకూర్చిందన్నారు.
వ్యక్తిగతంగా..
గవర్నర్ రవి గురించి ప్రస్తావిస్తూ తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ పరిచయం లేదని, అది గవర్నర్ అయినా, ప్రధానమంత్రి అయినా. ప్రత్యక్ష శత్రుత్వం కూడా లేదని స్పష్టం చేశారు. వారి స్థానాన్ని సరైన రీతిలో గౌరవాన్ని తాము అందిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల గవర్నర్లతో ప్రభుత్వాలను తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్ భవన్‌ను, విశ్వ విద్యాలయాలను తమకు అనుకూలంగా మలచుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వేదికగా ఎంపిక చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ద్వారా ప్రజాస్వామ్య హక్కులు రక్షించపడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి, ఉన్నత స్థాయి కమిటీ గురించి స్పందిస్తూ, ఢిల్లీలో ఉన్నవారు సుల్తానులు కారు, తమిళనాడు లాగా రాష్ట్రాలను పాలించే వారు బానిసలు కాదు! అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి – కేంద్రంలో సమాఖ్యవాదం లక్ష్యంగా తాము ఆది నుంచి పట్టుపడుతూ వస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు కూడా గతంలో అమలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం స్వయంగా తనను తాను సుల్తాన్‌న్‌గా భావించి, రాష్ట్రాల హక్కులన్నింటినీ తనదిగా భావించి లాక్కోవాలనుకుంటోందని మండిపడ్డారు. విద్యాహక్కు, ఆర్థిక హక్కు, పన్ను హక్కు, అధికార హక్కు అంటూ అనేక హక్కులను హరించుకుంటూ పోతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళికతో పనిచేస్తూ ముందుకెళుతోందని, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను ఎదుర్కోవడానికే ఉన్నత స్థాయి కమిటీని రంగంలోకి దించామన్నారు.
న్యూస్‌రీల్
దేశ భద్రతకు భంగం కలుగకుండా..
కేంద్ర ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల కూటమికి నాయకత్వం వహిస్తారా.? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాష్ట్ర హక్కుల సాధనకు సాగిన పరిణామాలను గుర్తుచేస్తూ, డీఎంకే నేతృత్వంలోని ఆ గొంతును ఇతర రాష్ట్రాలు కూడా ప్రతిధ్వనింపజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాష్ట్ర హోదా కోసం మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను వదులుకోమని, వాటి కోసం ఎలాంటి లాభాపేక్షతో కాకుండా దేశ సమగ్రతకు భంగం కలుగకుండా ఎంత వరకై నా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఎంతో గర్వించదగ్గ భాష తమిళం అంటూ, రాజుకు నచ్చకుంటే తమిళులను దేశంలో రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తారా..? పౌరులు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. తమ కూటమి బలమైనదని, ద్రావిడ మోడల్ పాలనకు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడు ప్రయోజనమే ముఖ్యం
సీఎం స్టాలిన్ వ్యాఖ్య
ముదుమలైలో సీఎం..
కోయంబత్తూరు జిల్లా పరిధిలో ముదుమలై రిజర్వు పారెస్టు ఉన్న ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం సందర్శించారు. ఏనుగులకు ఆహారం పంపిణీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ పర్యటనలో ఉన్న సీఎం స్టాలిన్ ముదుమలై రిజర్వు ఫారెస్టులోని ఆసియాలోనే అతి పెద్దదిగా పేరుగడించిన తెప్పకాడు ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఊటీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయన అక్కడి ఏనుగులకు ఆహారం పంపిణీ చేశారు. ఏనుగు మావటీలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గున్న ఏనుగుపై వచ్చిన డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్ , బెల్లి దంపతులను కలిశారు. వారితో మాట్లాడారు.
ఎవరితోనూ శతృత్వం ఇల్లే.. రాష్ట్ర హక్కులను వదులుకోం.. వాటి కోసం ఎలాంటి లాభాపేక్షతో కాకుండా దేశ సమగ్రతకు భంగం కలుగకుండా ఎంత వరకై నా వెళ్లడానికి సిద్ధం..ఎంతో గర్వించదగ్గ భాష తమిళం..రాజుకు నచ్చకుంటే తమిళులను దేశంలో రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తారా..?అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ఎవరితోనూ శతృత్వం ఇల్లే!

ఎవరితోనూ శతృత్వం ఇల్లే!

ఎవరితోనూ శతృత్వం ఇల్లే!