
తెగిపడిన రైల్వే విద్యుత్ తీగలు
తిరుత్తణి: భారీ గాలులకు రైల్వే విద్యుత్ తీగలు తెగిపడడంతో అరక్కోణం–చైన్నె మార్గంలో విద్యుత్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. చైన్నె నుంచి అరక్కోణం వరకు విద్యుత్ రైలు సేవలు అందుతున్నాయి. ఈక్రమంలో సోమవారం చైన్నె సెంట్రల్ నుంచి అరక్కోణంకు విద్యుత్‌రైలు బయల్దేరింది. ఆ రైల్లో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరువలంగాడు రైల్వే స్టేషన్ వద్దకు రైలు చేరుకుంటుండగా ట్రాక్‌పై గాలి బీభత్సానికి విద్యుత్ రైలు తీగ తెగిపడి రైలు సేవలు ఆగిపోయాయి. వెంటనే తిరువలంగాడు రైల్వే స్టేషన్ మాస్టర్ అరక్కోణం రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులతోపాటు సిబ్బంది సంఘటన ప్రాంతం చేరుకుని ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్ రైళ్లు పయనించాయి. అనంతరం తెగిన విద్యుత్ తీగలకు మరమ్మతులు చేపట్టారు.