
వీనులవిందుగా సంగీత కచేరీ
కొరుక్కుపేట: శ్రీకృష్ణ గీతా సమాజం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత గాయని యడవల్లి అరుణాశ్రీనాథ్ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. రెండు గంటల పాటు సాగిన ఈ కచేరీ మహాగణపతిం భజేతో మొదలైంది. ఆ తరువాత అన్నమయ్య కీర్తనలను, పలు భక్తిగీతాలను శ్రావ్యంగా వినిపించి వీనుల విందు చేశారు. ప్రత్యేకించి మాధవా కేశవా, బ్రహ్మ మొక్కటే, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చివరిగా సంగీత దర్శకులు, గాయకులు ఎంఆర్ సుబ్రమణ్యం కూడా పాటలను ఆలపించి శ్రోతలను ఆనందింపజేశారు. మృదంగంపై పార్థసారఽధి, వయోలిన్‌పై రమేష్‌లు వాయిద్య సహకారం అందించారు. కమిటీ నిర్వాహకులు జీకే జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.