● శిక్షణ ముగింపు
తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి అర్హత కలిగిన ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్లుగా డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి 54 మంది అధికారులు పట్టభద్రులయ్యారు. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పట్టభద్రులయ్యారు. విద్యా, విమాన శిక్షణతో కూడిన 24 వారాల సవాలుతో కూడిన కోర్టును విజయవంతం చేశారు. భారత వైమానిక దళ శిక్షణ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ తేజ్‌బీర్ సింగ్ ముఖ్య అతిథిగా, కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కేపీ సింగ్ హాజరై కోర్సులను విజయవంతంగా ముగించిన వారిని సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. – సాక్షి, చైన్నె


