సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
ఘనంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చైన్నెలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు చిన్నారుల నడుమ కేక్ కట్టింగ్‌లు వస్త్రాలు, బిర్యానీ పంపిణీ పలుచోట్ల ర్యాలీలు
సంక్షేమం.. అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌లో వాయువేగంతో పట్టాలెక్కించిన జననేత వైఎస్. జగన్ అంటూ చైన్నెలోని ఆయన అభిమానులు ముక్తకంఠంతో
నినదించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం చైన్నెలో అత్యంత వేడుకగా నిర్వహించారు. పిల్లలు, విద్యార్థి, యువ జన సమూహం నడుమ సంబరాలు చేసుకున్నారు.
పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. వస్త్రాలను పంపిణీ చేశారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
సాక్షి, చైన్నె: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తమిళనాడులోని అభిమాన లోకం గురించి తెలిసిందే. ఈ అభిమానాన్ని ఆయన వారసుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద చూపుతూ వస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్ వేదికగా తమిళనాట సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా తమకు జగనన్నే ముఖ్యం అని చాటుకుంటూ వస్తున్నారు. ఇటీవల చైన్నెకు తమ నేత వచ్చిన సందర్భంలో చూపిన అభిమానం అంతా ఇంతా కాదు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ నేత ఇచ్చిన పిలుపుతో చైన్నెలో 10 వేల సంతకాలను అభిమానులు సేకరించారు. గత నెల తాడేపల్లిలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసి ఈ దరఖాస్తులను అందజేశారు. తాజాగా ఆదివారం తమ అభిమాన నేత జన్మదినం కావడంతో పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జకీర్ హుస్సేన్ నేతృత్వంలో పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. వైఎస్ జగన్ బర్త్‌డేను పురస్కరించుకుని ఆయన చిత్ర పటంతో పెరంబూరు సోమ సుందరం నగర్ పరిసరాలలో సేవాదళ్ వర్గాలు ర్యాలీ నిర్వహించారు. చైన్నె పెరంబూరులోని పార్టీ కార్యాలయం ఆవరణలో జై జగన్ నినాదాలను హోరెత్తించారు.
సేవా కార్యక్రమాలతో..
చైన్నెలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు జరిగాయి. సోమ సుందరం నగర్‌లో ర్యాలీ పెద్దసంఖ్యలో విద్యార్థుల ర్యాలీ జరిగింది. నగర శివారులోని సవీత కళాశాలలకు చెందిన జగనన్న అభిమాన సందోహం విద్యార్థులు ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. వైఎస్ జగన్ చిత్ర పటం, పార్టీ జెండాలతో కార్ల ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం ఇక్కడ అందరికీ బిర్యానీ పంచి పెట్టారు. అనంతరం వ్యాసార్పాడిలోని డాన్‌బాస్కో వృద్ధుల ఆశ్రమం, అనాథ పిల్లల ఆశ్రమాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడి పిల్లల చేత కేక్ కట్ చేయించారు. ఇక్కడి ఫాస్టర్లు అలెక్స్, సహాయం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ పిల్లలతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఇక్కడి పిల్లలు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. కేక్, చాక్లెట్లను అందరికీ అందజేశారు. అలాగే ఇక్కడున్న వారందరికీ మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో సేవా దళ్ అధ్యక్షుడు ఏకే జకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, యువ నేతలు భాను ప్రకాష్, సాయి సింహారెడ్డి, అధికార ప్రతినిధి కృతిక, వైఎస్సార్ సీపీ నేత శరత్ కుమార్ రెడ్డి, సంపత్‌కుమార్ ,చంద్రశేఖర్, రత్నం, రేవంత్ రెడ్డి, ఉమా తదితరులు పాల్గొన్నారు.
షోళింగనల్లూరులో..
షోళింగనల్లూరులోని ఫాతిమా అనాథాశ్రమంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిలల్లకు పండ్లు పంపిణీ చేశారు. వృద్ధులకు సహాయకాలు అందజేశారు. ఉదయం అల్పాహారం అందజేశారు. పిల్లలతో కేక్ కట్ చేయించారు. ఆశ్రమానికి కుర్చీలు విరాళంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మితికేల వరుణ్‌కుమార్, రామచంద్రారెడ్డి, మాల్యాద్రిరెడ్డి, త్రివేణిరెడ్డి, అశోక్‌రెడ్డి, రామిరెడ్డి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
తొరై పాక్కంలో..
చైన్నె శివారులోని తొరై పాక్కంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకను ఘనంగా అభిమానులు నిర్వహించారు. కేక్‌కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. కార్యక్రమంలో రెగల గడ్డ పెద్ద నర్సింహులు, చిన్న నర్సింహులు, మితికేల వరుణ్‌కుమార్, గుమ్మామురళి , గురు కృష్ణ, రామతీర్థం, తిరుపతయ్య, రమేష్, మాలి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
యువజనోత్సహం..
చైన్నె శివారులోని భారత్ వర్సిటీ, వేల్ టెక్ వర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులు అభిమాన సందోహం ఉప్పొంగింది. భారత్ వర్సిటీలోని తెలుగు విద్యార్థులు, అభిమానులు సేవాదళ్‌కు చెందిన నరేన్ రెడ్డి నేతృత్వంలో మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేశారు. వైఎస్ జగన్ చిత్ర పటాలతో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం ఆవడిలోని వేల్ టెక్ వర్సిటీలోని అభిమానులు సందడి చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా హోరెత్తించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. వేల్ టెక్ సేవాదళ్ అభిమాన విద్యార్థి నాయకులు భరత్, శంకర్, నరేష్, గౌతవ్‌ు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జెండాలతో కారు, బైక్‌ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలను హోరెత్తించారు. యువత కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగనన్న వెన్నంటే తాము ఉంటామని, మళ్లీ సీఎంగా ఆయన్ను చూడటమే లక్ష్యంగా శ్రమిస్తామని నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి సేవాదళ్ వర్గాలు పెద్దఎత్తున హాజరై ఆనందాన్ని పంచుకున్నారు.
సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి


