అపూర్వ కలయిక
తిరుత్తణి: మూడు దశాబ్దాల తరువాత పూర్వ తెలుగు విద్యార్థులు తాము చదువకుకున్న పాఠశాల వేదికగా కలుసుకుని గురు వందనం చేసి అశీస్సులు పొందారు. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో 1993–94 విద్యా సంవత్సరంలో 50 మంది విద్యార్ధులు టెన్త్ చదువుకున్నారు. వారంతా ఉన్నత చదువులు చదవుకుని ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో దేశ విదేశాల్లో కుటుంబాలతో స్థిరపడ్డారు.ఈ క్రమంలో విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పిన గురువు అశీస్సులు పొందాలని ఆశయంకు కొంత మంది పూర్వ విద్యార్ధులు కృషితో అందరూ ఏకమయ్యారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో అప్యాయంగా పలకరించుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులు ఈశ్వరరావుకు ఘన స్వాగతం పలికి గురు వందనం చేసి అశీస్సులు పొందారు. తర్వాత సహపంక్తి భోజనాలు చేసి ఇళ్లకు పయనమయ్యారు.


