క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Dec 22 2025 2:18 AM | Updated on Dec 22 2025 2:18 AM

క్లుప

క్లుప్తంగా

● చైన్నె వాసి అరెస్ట్‌ ప్రశాంతంగా ఎస్‌ఐ రాత పరీక్షలు రూ.79 లక్షలు స్వాధీనం ● నలుగురు నెల్లూరు వాసుల అరెస్ట్‌ ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం

మహిళపై అత్యాచారం, హత్య

అన్నానగర్‌: రాజ రాజ చోళుని కాలంలో నిర్మించిన పురాతన చోళేశ్వరర్‌ ఆలయం పుదుక్కోట్టై జిల్లాలోని పొన్నమరావతిలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కొన్నయ్యూర్‌ ముత్తు మారియమ్మన్‌ ఆలయాన్ని కూడా చాలా మంది భక్తులు సందర్శిస్తారు. దీంతో 100 మందికి పైగా యాచకులు గుంపుగా ఉంటూ అక్కడి దుకాణాల నుంచి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో చైన్నెలోని ఓల్డ్‌ వాషర్‌మన్‌పేట్‌కు చెందిన 61 ఏళ్ల స్వామీజీ సతీష్‌కుమార్‌ భిక్షాటన చేస్తున్న ఉన్నారు. తీవ్రమైన చలి కార ణంగా, చాలా మంది యాచకులు పొన్నమరావతిలోని ఆసుపత్రి సమీపంలో ఆశ్రయం పొందారు. ఇంతలో, ఆదివారం వేకువజామున గుర్తు తెలియని మహిళ గోర్లతో గీకిన గాయా ల తో మృతదేహంగా పడిఉన్నారు. పొన్నమరావతి పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతురాలు ఆవుర్‌కు చెందిన నూర్జహాన్‌ అని తేలింది. ఆమైపె అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు శవపరీక్షలో తేలింది. ఈ ఘాతుకానికి పాల్పడింది సతీష్‌ కుమార్‌ అని తేలడంత అతడిని అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

తిరువళ్లూరు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు యూనిఫామ్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు ఆద్వర్యంలో ఎస్‌ఐ రాత పరిక్షలు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోస్టులకు తమిళనాడు యూనిఫామ్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే రాత పరీక్షలపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షలను వాయిదా వేశారు. కాగా రాత పరీక్షలకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం ఉదయం పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,769 మంది రాత పరిక్షలకు అర్హత సాధిచగా వీరి కోసం తిరువళ్లూరు పట్టణంలోని శ్రీనికేతన్‌, ధర్మమూర్తి రావ్‌ బహదూర్‌ కలవల కన్నన్‌ పాఠశాల, కలవల కన్నన్‌ పాఠశాల తదితర మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా పరిక్షలకు 1,935 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా పరీక్షలను కాంచీపురం మండల డీఐజీ దేవరాణి, తిరువళ్లూరు ఎస్పీ వివేకానంద శుక్లా తదితరులు పర్యవేక్షించారు.

తిరువొత్తియూరు: చైన్నె, తండయార్‌పేటలో సరైన పత్రాలు లేకుండా సుమారు రూ.70 లక్షల నగదు, బంగారం, వెండి నగలు తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె కొరుక్కుపేట పోలీసులు మత్తు పదార్థాలు నియంత్రణ విభాగం (ఎస్‌ఐవో) పోలీసులతో కలిసి తెల్లవారుజామున తండయార్‌పేట, వైద్యనాథన్‌ బ్రిడ్జి సర్వీస్‌ రోడ్డు, తండయార్‌పేట రైల్వే ట్రాక్‌ సమీపంలో నిఘా పెట్టారు. అక్కడ బ్యాగులతో అనుమానాస్పదంగా నిలబడి ఉన్న నలుగురి ని విచారించగా, వారు పోలీసులను అసభ్యంగా మాట్లాడి బెదిరించి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. వారు కలిగి ఉన్న బ్యాగులో వార్తాపత్రికలతో చుట్టబడిన నగదు కట్టలు, బంగారం, వెండి వస్తువులు ఉన్నాయని, వాటికి సరైన పత్రాలు లేవని తేలింది. దీంతో వారిని అరెస్టు చేసి విచారించగా, నలుగురూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరుకు చెందినవారని, సుమారు రూ.70 లక్షల నగదు, 108 గ్రాముల బంగారు నగలు, కిలో వెండిని సరైన పత్రాలు లేకుండా ఉంచినట్లు తేలింది. దీంతో పోలీసులు నెల్లూరుకు చెందిన అమర్తవరు వెంకట సురేష్‌ బాబు (68), పొన్నూరు వెంకట కమల్‌ (35), దుర్గి గోపి కిషోర్‌ (60), పఠాన్‌ బసియుల్లా ఖాన్‌ (52)ను పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

కొరుక్కుపేట: ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని చైన్నె పిరమిడ్‌ స్పిరుచ్చువల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి అమరా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా పిరమిడ్‌ స్పిరిచువల్‌ సొసైటీ మూమెంట్స్‌ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రీజీ ఆశీస్సులతో చైన్నె అగత్యర్‌ మహా పిరమిడ్‌ క్షేత్రం మాస్టర్‌ అందరూ కలిసి సంగీతనాథ ధ్యానంను ఆదివారం నిర్వహించారు. దీనికి వేపేరిలోని మహారాష్ట్ర భవన్‌ వేదికై ంది. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ ధ్యాన కార్యక్రమంలో 200 మందికి పైగా పాల్గొని అఖండ ధ్యానం, సజ్జన సాంగత్యం చేశారు. అలాగే ఈనెల 4 ,5, 6 ,7 తేదీల్లో జరిగిన ధ్యాన మహా యజ్ఞం–8 సక్సెస్‌ మీట్‌ ను సందర్భంగా నిర్వహించుకున్నారు. ఇందులో పీఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయకుమార్‌ , చైన్నె పిరమిడ్‌ స్పిరిచువల్‌ ట్రస్ట్‌ సెక్రెటరీ అమరా చంద్రశేఖర్‌, ట్రెజరర్‌ స్వర్ణ శ్రీ , పీఎంసీ ట్రస్ట్‌ సభ్యులు ప్రశాంతి పాల్గొన్నారు. ధ్యానం కు సంబంధించిన పుస్తకాలు, పిరమిడ్‌ కొత్త సంవత్సర క్యాలెండర్‌లను ఆవిష్కరించారు. తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ వైస్‌ చైర్‌పర్సన్‌ మల్లికా ప్రకాష్‌ పాల్గొన్నారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement