ఘనంగా పగల్ పత్తు, ఇరాపత్తు ఉత్సవం
తిరువొత్తియూరు: పూందమల్లి తిరుక్కచ్చి నంబిగళ్, వరదరాజ పెరుమాళ్ కోవెలలో పగల్ పత్తు, ఇరా(రాత్రి)పత్తు ఉత్సవం నిర్వహిస్తున్నారు. వివరాలు.. వైష్ణవ కోవెలల్లో మార్గళి మాసంలో పగల్ పత్తు, ఇరాపత్తు ఉత్సవాలు చేపడుతుంటారు. వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. దాని ప్రకారం మార్గళి మాసం పగల్ పత్తు లేదా తిరుమొళి తిరునాళ్ అని, వైకుంఠ ఏకాదశి తర్వాతి 10 రోజులు ఇరా పత్తు లేదా తిరువాయ్ మొళి తిరునాళ్ అని పిలుస్తారు. సంస్కృత వేదాలకు సమానంగా ఆళ్వార్లు రచించిన ద్రావిడ వేదం అనబడే నాలాయిర దివ్య ప్రబంధాన్ని ముందు నిలబెట్టి రామానుజులచే ఈ ఉత్సవం మొట్టమొదటగా శ్రీరంగంలో ప్రారంభించారు. ఆ తర్వాత అన్ని దివ్య దేశాలలోనూ ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు. దాని ప్రకారం పూందమల్లి తిరుక్కచ్చి నంబిగళ్, వరదరాజ పెరుమాళ్ కోవెలలో శనివారం నుంచి వచ్చే డిసెంబర్ 29వ తేదీ వరకు పగల్ పత్తు ఉత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రోజూ ప్రత్యేక పూజలు మరియు మధ్యాహ్నం సేవ, దీపారాధన సాత్తుమురై జరుగుతాయి. డిసెంబర్ 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్వర్గద్వార దర్శనం, వరదరాజ పెరుమాళ్ తిరువీధి ఉత్సవాలు జరుగుతాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు ఇరా పత్తు ఉత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి రోజూ సాయంత్రం 6 గంటల సమయంలో సేవ, దీపారాధన, సాత్తుమురై చేపడుతారు. జనవరి 9వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఇయర్పా సాత్తుమురై జరుగుతుంది. పగల్ పత్తు, ఇరా పత్తు ఉత్సవాలలో ఆళ్వార్ల ప్రబంధాలు మొత్తం విష్ణు మూర్తి ముందు అర్చకులు పారాయణం చేస్తారు. తిరుక్కోవెలల్లో తిరుమాళ్ తిరువూరువం( మూర్తి)మధ్యలో ప్రధానంగా వేంచేసి ఉండగా ఆళ్వార్లు ఒకవైపు, ఆచార్యులు ఒకవైపు వేంచేసి ఉండే ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఈ 20 రోజులు మాత్రమే దర్శించే అవకాశం లభిస్తుంది. ఉభయదార్ల భాగస్వామ్యంతో జరిగే ఈ ఉత్సవ ఏర్పాట్లను కోవెల కార్యనిర్వహణాధికారి లత పర్యవేక్షిస్తున్నారు.
లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి
తిరువొత్తియూరు: అంబత్తూరు నుంచి అంబత్తూరు ఎస్టేట్ సర్వీస్ రోడ్డుకు వెళ్లే అత్తిపట్టు కుప్పం రోడ్డు పక్కన పండ్ల దుకాణం ఉంది. దాని పక్కనే అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన సరుకు మినీ వ్యాన్‌ను నిలిపి ఉంచాడు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పండ్ల దుకాణం, సరుకు వ్యాన్ అకస్మాత్తుగా మంటలు చెలరేగి తగలబడ్డాయి. కొద్దిసేపట్లోనే మంటలు పూర్తిగా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సరుకు వ్యాన్, పండ్ల దుకాణం , రోడ్డు పక్కన వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లు ధ్వంసమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
4 కార్లను ఢీ కొట్టిన వైనం
అన్నానగర్: కోయంబత్తూరులోని పేరరర్ గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన కుమార్ (50) లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలోని శరవణంపట్టిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో లారీలో సిలికాన్ లోడ్ చేసుకుని శనివారం రాత్రి శరవణంపట్టి రోడ్డులో వెళ్తున్నాడు. అతనితో పాటూ లారీ క్లీనర్ గా ఇలైయరసు ఉన్నాడు. ఆ సమయంలో, డ్రైవర్ కుమార్ కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. దీని కారణంగా అతను నియంత్రణ కోల్పోయిన లారీ అకస్మాత్తుగా వ్యతిరేక దిశలో వెళ్లి రోడ్డుపై ప్రయాణిస్తున్న నాలుగు కార్లను ఢీ కొట్టింది. వెంటనే సమీపంలో కూర్చున్న ఇలైయరసు వేగంగా స్పందించి బ్రేక్‌లు వేసి లారీని రోడ్డు మధ్యలో ఆపాడు. ఇరుగు పొరుగువారి సహాయంతో, డ్రైవర్ కుమార్‌ను రక్షించి చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వారిని తదుపరి చికిత్స కోసం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు లారీ డ్రైవర్ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. గాంధీపురం ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


